India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి MLC కౌంటింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ తేలుకాటుకు గురైంది. మీడియా సెంటర్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆమెను బుధవారం రాత్రి తేలుకాటు వేసింది. అక్కడున్న సిబ్బంది 108 వాహనంలో చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల MLC ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

జాతీయ న్యాయసేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశాలమేరకు జూన్ 8న నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు, ప్రధాన జిల్లా న్యాయమూర్తి యం.నాగరాజు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు, బ్యాంకు రికవరీ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చు అన్నారు.

తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన ఎన్నికల(2014)లో నల్గొండ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గుత్తా గెలిచారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి (INC) పోటీ చేసి విజయం సాధించారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు బావుట ఎగురవేశారు. దీంతో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖాతా తెరవని స్థానంగా ఉంది.

ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తరువాత స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి పెద్ద ఎత్తున పోల్ అయినప్పటికీ అవి చెల్లుబాటు కాలేదు. దీంతో రాకేష్ రెడ్డి కాస్త వెనుకబడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో రౌండ్‌లో 96 టేబుళ్లపై 96 వేల ఓట్లు లెక్కించనున్నారు. కాగా, తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 4రౌండ్లలో పూర్తి కానుంది. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా.. అందులో 2139 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి. అర్ధరాత్రిలోపు తొలిప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

నల్గొండ, భువనగిరి రెండు లోక్‌సభ స్థానాల్లో గతంతో పోలిస్తే భాజపాకు గణనీయమైన ఓట్లు వచ్చాయి. నల్గొండ, భువనగిరి నుంచి పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్ రెండింటిలోనూ భారాస అభ్యర్థులను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలవడం విశేషం. నల్గొండలో శానంపూడికి 2,24,421 ఓట్లు రాగా, భువనగిరిలో గతేడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 3,32,467 ఓట్లు పెరగడం విశేషం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ MP ఎన్నికల్లోనూ NLG, BNRలో విజయం సాధించి నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించింది. నల్గొండలో 5.59లక్షల మెజార్టీ రాగా, భువనగిరిలో 2లక్షల పైచిలుకు మెజార్టీ వచ్చింది. BNRలో రాజగోపాల్ రెడ్డి అన్నితానై నడిపించగా, NLG ఇన్‌ఛార్జీగా ఉత్తమ్ తీవ్రంగా శ్రమించారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న HNRలో హస్తం పార్టీకి లక్షకు పైగా మెజార్టీ వచ్చింది.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రధాన అభ్యర్థులుగా రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్), తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) ప్రేమేందర్ రెడ్డి (బీజెపి), అశోక్ (స్వతంత్ర) బరిలో ఉన్నారు. మంగళవారం వెల్లడైనా నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో ఎమ్మెల్సీ ఫలితం ఆసక్తిరేపుతోంది.

2009లో నూతనంగా ఏర్పాటైన భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తొలిసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్ గెలిచారు. 2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. 2024 ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. వీరంతా మొదటిసారి పోటి చేసి గెలుపొందిన వారే.
Sorry, no posts matched your criteria.