India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహపరిచాయి. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి క్యామ మల్లేష్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మూడో స్థానానికి వెళ్లడంతో పార్టీ శ్రేణులల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. నల్గొండ ఎంపీ అభ్యర్థికి 2,18,417 ఓట్లు రాగా, భువనగిరిలో పోటీ చేసిన అభ్యర్థికి 2,56,187 ఓట్లు వచ్చాయి.

ఒకే ఇంటి నుంచి ఇద్దరు ప్రజాప్రతినిధులుగా విజయం సాధించారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి చిన్న కుమారుడు అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలుపొందగా, పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా 5,59,906 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు.

భారీ మెజార్టీతో గెలిచిన రఘువీర్ గతంలో జగన్ సాధించిన రికార్డును బద్దలు కొట్టారు. 2011లో కడప MP స్థానానికి జరిగిన బై పోల్‌లో జగన్ మెజార్టీ 5,45,672. ఆ రికార్డును తిరగరాస్తూ రఘువీర్ 5,59,905 లక్షల మెజార్టీ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీ మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహరావు పేరిట ఉంది. 1991లో నంద్యాల స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన 5.8 లక్షల పైచిలుకు ఓట్లు సాధించారు.

లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 6086 ఓట్లు పోలవగా భువనగిరిలో 4646 ఓట్లు పోలయ్యాయి. కాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి 60.5% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై గెలుపొందారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ 44.89% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై గెలుపొందారు.

భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ధ్రువీకరణ పత్రాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగే అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. నల్గొండ పార్లమెంట్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి ఐదు లక్షల 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండు లక్షల 44 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ తొలిసారి ఎంపీ అభ్యర్థులుగా గెలుపొందారు. తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికిఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ , మాణిక్ రావు, సూర్యవంశీ , జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన సర్టిఫికెట్ అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి వారితో ఉన్నారు.

నల్గొండలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంపై నమ్మకంతో రఘువీర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించిన నల్గొండ ప్రజానీకానికి శిరస్సువంచి నమస్కరిస్తున్నాని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ కష్టసుఖాల్లో అండగా ఉంటానని మాటిస్తున్నానని తెలిపారు. ఇది నల్గొండ ప్రజల, కాంగ్రెస్ కార్యకర్తల కష్టఫలమని చెప్పారు. ‘నల్గొండ నా బలం బలగం’ అంటూ ట్వీట్ చేశారు.

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా అనిశెట్టి దుప్పలపల్లి కౌంటింగ్ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావుతో కలిసి నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక వర్గాల కౌంటింగ్ ను ప్రత్యేకంగా ఆ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.

నల్గొండ పార్లమెంట్ 17వ రౌండ్ ఫలితాలు వెలువడే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి 2,55,082 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఈ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 3,78,649 ఓట్లు రాగా
బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 1,23,567 ఓట్లు వచ్చాయి.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 1,04,457 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Sorry, no posts matched your criteria.