India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. చివ్వెంల మండలం కుడకుడ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మోకు జారి కింద పడడంతో గీత కార్మికుడి బిక్షంకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదారాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో నీటి అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు అధికారుల బృందం నిఘా పెట్టారు. ఆయకట్టు పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పెద్దదేవులపల్లి, పాలేరు చెరువులను నింపి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా 3టీఎంసీల నీటిని ఎడమ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ఆయా మండలాల్లో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 513.10 అడుగులు (136.9932 టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 4,881 క్యూసెక్కుల నీటిని, జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి మొత్తం 6,231 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువ నుంచి ఎటువంటి నీటి రాక లేదు.
దేవాలయం రాతి గోపురంలో వజ్రాలు ఉంటాయని దానిని ధ్వంసం చేసిన ఘటన అనుముల మండలంలోని చోటుచేసుకుంది. పేరూరులో సోమేశ్వరస్వామి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించారు. గతేడాది రూ.40 లక్షల నిధులతో దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. గోపురం తొలగించి దేవాలయ ఆవరణలో పెట్టారు. దుండగులు ఆ రాతి గోపురాన్ని వాగులోకి తీసుకెళ్లి పగలగొట్టారు. అటుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి దేవాలయం కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.
కృష్ణా నది ఒడ్డున గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనా సంఘటన మంగళవారం చింతలపాలెం మండల పరిధిలోని బుగ్గమాదారం గ్రామ శివారులో బుగ్గ వాగు కృష్ణానదిలో కలిసే చోట వెలుగు చూసింది. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుగ్గ మాధవరం గ్రామంలోని బుగ్గ వాగు కృష్ణ నదిలో కలిసే ప్రాంతంలో సుమారు 55 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన మగ వ్యక్తి మృతదేహం కనిపించడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు
గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, RRB, SSC, రాష్ట్రస్థాయి, కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఈనెల 4న నల్గొండలోని విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NLG: ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా లోకసభ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకసభ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం లోక్ సభ ఎన్నికల పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ కార్యక్రమానికి మొత్తం 4740 మంది హాజరు కావాల్సి ఉండగా 4064 మంది మాత్రమే హాజరయ్యారు. 676 మంది శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నేడు ఆత్మకూర్ పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పిహెచ్సీ పరిధిలోని గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.