Nalgonda

News April 17, 2024

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

image

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు NLG కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ చేసే అభ్యర్థులు ఫారం 2ఏ లో అన్ని వివరాలు పూరించి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు.

News April 17, 2024

NLG: పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మునుగోడు మండలంలోని కోతులారంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిళ్ల వంశీ లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. డ్యూటీ దిగి ఇంటికి వచ్చి.. ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి, నారాయణపురంలోని ఇటుకల బట్టి వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

News April 17, 2024

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

మిర్యాలగూడలో ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకాల్వ తండాకు చెందిన నరసింహ కుటుంబ కలహాలతో పెద్ద మనుషుల మధ్య జరిగిన ఒప్పందంలో భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. మనస్తాపానికి గురై మండలంలోని అవంతీపురంలోని బాలాజీ టౌన్ షిప్ లో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 17, 2024

NLG: ‘ఇవేమి ఎండలు..! గతంలో ఎప్పుడూ చూడలేదు’

image

ఇవేమి ఎండలు నాయనా.. గతంలో ఎప్పుడూ ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు.. అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. మంగళవారం జిల్లాలోని మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 44.7, నాంపల్లిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 11 మండలాల్లో 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 17, 2024

NLG: జిల్లాలో కొనసాగుతున్న రేషన్ ఈ – కేవైసీ

image

ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ.. రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారి కోసం మరో అవకాశం ఉండకపోవచ్చని.. త్వరగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 17, 2024

ప్రభుత్వ ఖజానాకు రూ.60 కోట్ల టోకరా

image

కోదాడ పరిధిలోని కొమరబండ గ్రామ శివారులో ఉన్న వెంకటేశ్వర మిల్లుపై అడిషనల్ కలెక్టర్ లతా విజిలెన్స్ అధికారులతో మంగళవారం దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో ఉన్న సీఎంఆర్ నిలువలను తనిఖీ చేశారు. సుమారు 22 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎఫ్సీఐకి బాకీ ఉన్నట్లు తెలిపారు. 60 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ దాడుల్లో ఆర్డీవో సూర్యనారాయణ, డీఎం సివిల్ సప్లై రాములు ఉన్నారు.

News April 16, 2024

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ ఇంఛార్జీలు వీరే

image

భువనగిరి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది. ఇబ్రహీంపట్నం-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునుగోడు-గోపగాని వెంకటనారాయణ గౌడ్, భువనగిరి-నంద్యాల దయాకర్ రెడ్డి, నకిరేకల్-ఎలిమినేటి సందీప్ రెడ్డి, తుంగతుర్తి-బూడిద బిక్షమయ్యగౌడ్ , ఆలేరు- ఎగ్గే మల్లేశం, జనగామ-కంచర్ల రామకృష్ణారెడ్డిలను ఇంఛార్జీలుగా నియమించింది.

News April 16, 2024

బీఆర్ఎస్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే

image

నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల ఇంఛార్జీలను బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది. నల్లగొండ-తిప్పన విజయసింహారెడ్డి, నాగార్జునసాగర్- బండ నరేందర్ రెడ్డి, హుజూర్ నగర్-ఒంటెద్దు నరసింహారెడ్డి, దేవరకొండ- రేగటి మల్లికార్జున్ రెడ్డి, మిర్యాలగూడ-బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ- కటికం సత్తయ్య గౌడ్, సూర్యాపేట-ఇస్లావత్ రామచంద్రా నాయక్ లను నియమించింది.

News April 16, 2024

సూర్యాపేట సద్దుల చెరువులో మహిళ మృతదేహం

image

సూర్యాపేట సద్దుల చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సద్దుల చెరువులో మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి కుడి చేతిపై ఉమా అని పేరు రాసి ఉందని తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు.

News April 16, 2024

నల్గొండ: స్విమ్మింగ్ పూల్‌లో పడి యువకుడు మృతి 

image

చిట్యాల మండలం వట్టిమర్తికి చెందిన నూనె సంజీవయ్య కుమారుడు నూనె శ్రవణ్ కుమార్ మంగళవారం ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మరణించారు. విషయం తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి ప్రియదర్శిని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.