India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చండూరు పరిధిలోని బంగారిగడ్డలో ఓ పసికందును పడవేసిన ఘటన కలకలం సృష్టించింది. అయితే ఇది అవివాహితులు ఎక్కడో ప్రసవించి ఇక్కడ వదిలివేసి వెళ్లినట్లు ICDS అధికారులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో ధర్మభిక్షం జన్మించారు. నిజాం నవాబు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. ప్రజలను చైతన్య పరిచేవారు. ధర్మభిక్షం 3సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. కాగా ఇవాళ ధర్మభిక్షం వర్ధంతి.
ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. బస్సు చిట్యాల వద్దకు రాగానే అతనికి గుండెపోటు వచ్చిందని తోటి ప్రయాణికులు తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్సులో హైదరాబాద్కి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. గత పదేళ్లుగా ఎంపీటీసీలు మొదలు జిల్లా స్థాయి చైర్మన్ల వరకు అన్ని భారాస ఖాతాలోనే ఉండటంతో.. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మూడింట రెండొంతుల పురపాలికల్లో హస్తం పార్టీ పాగా వేసింది. మిగిలిన వాటినీ లోక్ సభ ఎన్నికల్లోపే హస్తగతం చేసుకునేలా కసరత్తు చేస్తోంది
ఉమ్మడి జిల్లాలో చిన్నారులు బలహీనమవుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సరైన పోషకాలు అందక బాలలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4, 203 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. 1, 81, 214 మంది ఆరేళ్ల లోపు చిన్నారులున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎందుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. తిరపతన్న యాదగిరిగుట్ట ఎస్సై, భువనగిరి సీఐగా పనిచేశారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు.
ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు గత ఏడాది కంటే ఈ సారి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గత పది రోజులుగా జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగాల్పులు వీస్తున్నాయి. ఈ కారణంగా మధ్యాహ్న సమయంలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోత కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు.
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం అందిస్తున్న దినసరి కూలీని పెంచుతున్నట్లు పేర్కొంది. దీంతో ఉమ్మడి జిల్లాలో 7.52 లక్షల కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. 2005లో కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభించిన సమయంలో దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది.
ఉమ్మడి జిల్లాలోని గొల్ల కురుమలు గొర్రెల యూనిట్ల విషయంలో ఆందోళనలో పడ్డారు. యూనిట్ల కోసం డీడీల రూపంలో డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించామని, కొత్త ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయినా గొర్రెలు ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కాపరులు కోరుతున్నారు.
నల్గొండ జిల్లాలో 1,483 ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటికి ఏటా స్కూల్ మెయిన్టెనెన్స్ కింద (చాక్పీసులు, డస్టర్లు , స్టేషనరీ, ఇతర వస్తువుల కొనుగోలు కోసం) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేస్తుంది. రెండేళ్లుగా ప్రభుత్వం జూలై, జనవరి నెలల్లో రెండు విడతల్లో ఈ నిధులు ఇస్తుంది. మూడు రోజుల క్రితం జిల్లాకు రూ.91 లక్షలు మంజూరు చేసింది.
Sorry, no posts matched your criteria.