India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైందా… అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళిక, తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా పరిశోధన సంచాలకులు డా. పి. రఘు రామిరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, NLG జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్యర్యంలో నల్గొండ కలెక్టరేట్లో శుక్రవారం దక్షిణ తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో నేటి నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.
భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని ఇక్కడి నుంచి బరిలో నిలిపేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఎంపీ టికెట్ కోసం తన భార్య ప్రయత్నించలేదని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తన భార్య పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.
మహిళ గొంతు కోసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారంకోర్టులో హాజరుపరిచినట్టు దేవరకొండ DSP గిరిబాబు తెలిపారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవలో డిండి మండలానికి చెందిన శ్రీలతను ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం సిద్ధనపాలెంకి చెందిన బొమ్మనబోయిన సాంబయ్య ఈనెల 14న మద్యం మత్తులో హత్య చేశాడన్నారు. మృతురాలి తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేతగానితనం వల్లనే రైతులు రోడ్డు మీద పడ్డారని సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. అనుముల మండలం కొట్టాల, చలమారెడ్డిగూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్, రమావత్ రవీంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు. పార్టీలో చేరికల కోసం గేట్లు ఎత్తడం కాదు.. ముందు నాగార్జునసాగర్ గేట్లెత్తి రైతులకు నీళ్లు ఇవ్వండని అన్నారు.
నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అర్హత కలిగిన వారు మొత్తం 43,326 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 22,992 మంది, మహిళలు 20,330 మంది ఉన్నారు. వీరిలో దివ్యాంగ ఓటర్లు 33,839 మంది.. 85ఏళ్లు పైబడిన ఓటర్లు 9,487 మంది ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఓటర్లు మాత్రమే ఫారం-12డీ ద్వారా నేటి నుంచి దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి.. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగానికి అనుమతిస్తారు.
కరువు మళ్లీ కోరలు చాస్తోంది. చేతికి అందివస్తుందనుకున్న వరి సహా పండ్ల తోటలు కళ్లముందే వాడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 11,13,170 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. 1,14,796 ఎకరాల్లో వరి పంట ఎండిపోయినట్లు సమాచారం. విధిలేని పరిస్థితుల్లో కొంత మంది రైతులు తమ పొలాల్లో పశువులను మేపు తుండగా, మరికొంత మంది ట్యాంకర్లలో నీటిని తరలించి పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిప్పర్తి మండల పరిధిలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్ తిప్పర్తి పోలీస్ స్టేషన్లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తిప్పర్తి నుంచి నల్గొండకు వెళుతుండగా వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడులో హెచ్.పీ బంకు పక్కన గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు మండలంలోని వెంకట్రాంపురానికి చెందిన చింతోజు ఉపేంద్ర చారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.