India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాంగ్రెస్ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్‌కుమార్‌రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.
హుజూర్‌నగర్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. ట్రాలీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. మఠంపల్లిలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కొనుగంటి నర్సిరెడ్డి విధులకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాంగ్రెస్ ఖాతాలో రెండు మున్సిపాలిటీలు చేరాయి. నల్గొండ జిల్లాలోని హాలియా, నందిగొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాగా వేసింది. ఆయా చోట్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్లపై అవిశ్వాసం నెగ్గడంతో శుక్రవారం నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. రెండు చోట్లా కాంగ్రెస్ మద్దతుదారులే పదవులు దక్కించుకున్నారు. హాలియా నూతన ఛైర్ పర్సన్‌గా యడవెల్లి అనుపమా, నందిగొండ ఛైర్ పర్సన్‌గా అన్నపూర్ణ ఎన్నికయ్యారు.
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాయిన వాని కుంట స్టేజీ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయలైన వ్యక్తిని సాగర్ కమల నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. వారు నాగార్జున సాగర్కు వాసులుగా గుర్తించారు.
పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ కోసం పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నామని NLG జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి డాక్టర్ అంబటి యాదగిరి తెలిపారు. జిల్లాలో సుమారు 2లక్షల తెల్లపశువులు, 3.11 లక్ష నల్లజాతి పశువులకు టీకాలను వేయడానికి 74 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఏప్రిల్ 15 వరకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ మళ్లీ మొదలైందా… అంటే అవుననే అంటున్నారు అక్కడి జనం. కొంతకాలంగా పలువురు శాస్త్రవేత్తలు నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథిగృహంలో బస చేస్తూ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. అయితే వారు ఇతర ఖనిజాల కోసం సర్వే జరుపుతున్నట్లు చెబుతూ వస్తున్నారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల ప్రణాళిక, తీసుకోవలసిన జాగ్రత్తలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా పరిశోధన సంచాలకులు డా. పి. రఘు రామిరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, NLG జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్యర్యంలో నల్గొండ కలెక్టరేట్లో శుక్రవారం దక్షిణ తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘ సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో నేటి నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.
భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మిని ఇక్కడి నుంచి బరిలో నిలిపేందుకు తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన శుక్రవారం స్పందించారు. ఎంపీ టికెట్ కోసం తన భార్య ప్రయత్నించలేదని అన్నారు. పార్టీ ఆదేశిస్తే తన భార్య పోటీ చేసేందుకు సిద్ధమన్నారు.
Sorry, no posts matched your criteria.