India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉద్యోగులు, యువతను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని,ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిశ్చయంతో యువత, నిరుద్యోగులు ఉన్నారని MLA జగదీష్ రెడ్డి అన్నారు. NLG-వరంగల్-ఖమ్మం MLC ఎన్నికలకు సంబంధించి సూర్యాపేటలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ‘పట్టుదలతో పని చేస్తే విజయం మనదే’ అని అన్నారు.

పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో విద్య అందించేందుకు నల్గొండ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మార్చి 2024 లో 10లో జిపిఏ 7.0 పైన జిపిఏ సాధించిన విద్యార్థులు జిల్లాలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు సంబంధిత పత్రాలతో telanganaepass. cgg.gov.in అనే సైట్లో దరఖాస్తు ఈ నెల 30లోపు చేసుకోవాలన్నారు.

నల్గొండ క్లాక్ టవర్ అంటే తెలియని వారుండరు. ఇటీవల పట్టణంలో వర్షం కురవగా ఓ వ్యక్తి ఆ ఏరియాని క్యాప్చర్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇంకేం.. క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. చిరు జల్లుల్లో క్లాక్ టవర్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. ఆ వ్యూ సూపర్ అంటూ నల్గొండ వాసులు కామెంట్లు చేస్తున్నారు. ఎలా ఉందో మీరూ చెప్పండి.

రేపటి నుంచి పది రోజుల పాటు సినిమాల ప్రదర్శనలకు విరామం ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాల సంఘం రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 40కి పైగా థియేటర్లు ఉన్నాయి. నిర్వహణ వ్యయం పెరిగిందని థియేటర్ల అద్దె పెంచాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

నల్గొండ ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈటల రాజేందర్ కీలక వాఖ్యల చేశారు. నల్గొండ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పట్టభద్రులు కూడా మోదీ వైపే చూస్తున్నారని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ను గెలిపించాలని ఈటల కోరారు.

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 17వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్.. 1, 3, 5 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా ములుగుకు చెందిన మహిపాల్ రెడ్డి(39) మృతిచెందగా, భార్య నవిత తీవ్రంగా గాయపడింది. బైక్‌పై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనాన్ని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లగా మంటలు చెలరేగి ద్విచక్రవాహనం కాలిపోయింది. దీంతో మహిపాల్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కంకణాలపల్లికి చెందిన సతీశ్ చారి రైలు కింద పడి చనిపోయిన ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేశరాజు పల్లి గ్రామ సమీపంలో రైల్ ట్రాక్ కింద పడి మృతి చెందారు. మృతుడికి భార్య, ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. సతీశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ డోర్ నంబర్ల సర్వే అర్ధాంతరంగా నిలిచిపోయింది. పూర్తి వివరాలు అందజేయకుండా సంబంధిత కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నారు. సర్వే ప్రారంభమై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. క్షేత్ర స్థాయిలో దాదాపు 80 శాతం సర్వే పూర్తయినట్లు సర్వే సంస్థ చెబుతున్నా అంతా అసంపూర్తిగానే ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు.
Sorry, no posts matched your criteria.