India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వానాకాలం సాగుకు జిల్లా వ్యవసాయశాఖ సన్నద్ధమవుతోంది. సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంలో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎరువుల కొరతను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తుగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఇప్పటికే ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు.

భువనగిరి MP సెగ్మెంట్ పరిధిలో 2019తో పోల్చితే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2019లో 75.11శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 76.78 శాతం నమోదైంది. 2019లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(INC) 5,119 స్వల్ప మెజార్టీతో బూర నర్సయ్య(BRS)పై గెలుపొందారు. మరి ఈసారి కాంగ్రెస్ తరఫున చామల, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేశ్ , బీజేపీ నుంచి బూర నర్సయ్య బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో 74.03 శాతం పోలింగ్ నమోదు అయిందని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మరో 2 శాతం పోలింగ్ నమోదు అయిందని తెలిపారు.

WGL-KMM-NLG పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉపఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని కలెక్టర్ హరి చందన తెలిపారు. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ పరిధి 12 జిల్లాలలో ఉందని, 12 మంది అదనపు కలెక్టర్లు ఏఆర్ఓలుగా ఉన్నారన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టుకోవచ్చని, దానికి సంబంధించిన అనుమతులు జిల్లా స్థాయి ఏఆర్వోల వద్ద అనుమతి తీసుకోవాలని అన్నారు.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. బుధవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉంది.

NLG-KMM-WGL MLC స్థానంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా నడిచింది. ఉమ్మడి ఏపీలో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గెలిచారు. రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసి 2009 పోటీ చేసిన దిలీప్ కుమార్ మరోసారి విజయం సాధించారు. 2015, 21లోనూ బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచారు.

నల్గొండ లోక్ సభ స్థానాన్ని తాము గెలుస్తామంటే.. తమకే అనుకూలంగా ఓట్లు వేశారంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏయే మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్లలో తమకు ఓట్లు పడ్డాయన్న వివరాలపై ఆరా తీస్తున్నాయి. తమకు అనుకూలమైన ఓటు పడిందని, తమ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, దేశంలోనే అధిక మెజార్టీ వస్తుందంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.

MLC పట్టభద్రుల ఉపఎన్నికపై BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల MLC స్థానానికి పార్టీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డిని BRS బరిలో దింపింది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఉపఎన్నికలో పార్టీ కార్యాచరణ, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించి నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

లోక్‌సభ పోరు ముగియగా మరో సమరానికి నల్గొండ సిద్ధమైంది. NLG-KMM-WGL MLC స్థానానికి ఈ నెల 27న బైపోల్ జరగనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నుంచి గెలవడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. ఆ పార్టీ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న (INC), BJP నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇండింపెండెంట్‌గా అశోక్ పోటీ చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళలు ఓటింగ్‌పై అంతగా ఆసక్తి చూపలేదు. జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో ఓటర్ల పరంగా మహిళలే ముందంజలో ఉన్నా.. పోలింగ్ శాతంలో పురుషుల కంటే వెనుకబడి పోయారు. నల్గొండ లోక్ సభ స్థానంలో మొత్తం మహిళా ఓటర్లు 8,80,453 మంది ఉండగా.. వీరిలో 6,43,450 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Sorry, no posts matched your criteria.