Nalgonda

News March 18, 2024

విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 18, 2024

రూ.5.73 కోట్ల విలువగల బంగారం పట్టివేత: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈరోజు మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న  బొలెరో వాహనం ఆపి తనిఖీ చేయగా.. రూ.5.73 కోట్ల బంగారం పట్టుకున్నట్లు తెలిపారు. 

News March 18, 2024

మిర్యాలగూడ పోయింది.. భువనగిరి వచ్చింది..

image

గతంలోని ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2008పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయ్యింది. కొత్తగా భువనగిరి నియోజకవర్గం ఏర్పడింది. ఈలోక్‌సభ స్థానం పరిధిలో మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్‌, భువనగిరి నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల్లోని జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. నల్గొండ పరిధిలో నల్గొండ, దేవరకొండ, సాగర్‌, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి.

News March 18, 2024

ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు: మాజీమంత్రి

image

నల్లగొండ మండలం అన్నపర్తి గ్రామంలో ఎండిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజుల కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అధికారులు, మంత్రులు ఎండిన పొలాలను పరిశీలించలేదని, మంత్రులు ముడుపులపై తాపత్రంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరత్నం రాజు, రైతులు పాల్గొన్నారు.

News March 18, 2024

MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

image

మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్‌ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.

News March 18, 2024

కోదాడ: క్యాన్సర్ బాధిత చిన్నారికి.. సాయం కోసం ఎదురుచూపులు

image

కోదాడ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు మహమ్మద్ అమన్ క్యాన్సర్ వ్యాధి బారినపడి ఇబ్బంది పడుతున్నాడు. HYDలోని ఓ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమర్ వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత స్థోమత లేని తండ్రి రియాజ్ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడాలని వేడుకుంటున్నాడు.

News March 18, 2024

NLG: ఏడేళ్ల తర్వాత వెనక్కి వెళ్లిన కృష్ణా జలాలు

image

ఏడేళ్ల తర్వాత కృష్ణా వెనుక జలాలు భారీగా వెనక్కి వెళ్లాయి. చేపలవేట చేసుకొని జీవనోపాధి పొందుతున్న మత్స్య కార్మికులకు ఈ ఏడాది కష్టంగా మారనుంది. నిత్యం చేపల కోసం మర బోట్లతో వేట కొనసాగించాల్సిన మత్స్యకార్మికుల కంటిచూపు మేర జలాలు వెనక్కి వెళ్లడంతో వారి మరబోట్లు ఒడ్డుకు చేరాయి. దీంతో చేపలవేట తగ్గుముఖం పట్టి ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News March 18, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో గడ్డికి గడ్డుకాలం

image

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.

News March 18, 2024

భువనగిరి శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

భువనగిరి పట్టణ శివారులోని హుస్నాబాద్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు పట్టణ ఎస్సై సురేష్ తెలిపారు. కాలిపోయి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారని మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటాయన్నారు. కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2024

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిక్షమయ్య గౌడ్..?

image

భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. BNG, NLG స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఉన్నందున BNG సీటును అదే సామాజికవర్గానికి చెందిన బిక్షమయ్య గౌడ్‌కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.