India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో మందు బాబుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనుకున్న దానికంటే అధికంగా వస్తుంది. గతేడాది 26,94,304 కాటన్ల మద్యం, 37,83,834 కాటన్ల బీర్ల అమ్మకాలు జరుగగా రూ.2,669.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఏడాదిలో 27,97,133 కాటన్ల మద్యం, 44,32,099 కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2,797.80 కోట్ల ఆదాయం సమకూరింది.
తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల నల్గొండలో పదో తరగతి పరీక్షలు రాసిన ఆ విద్యార్థిని ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తిప్పర్తి పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. టెట్ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్ఈఆర్టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్ తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం వేళల్లో సైతం ఎండల ధాటికి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం నాంపల్లి, పెన్‌పహాడ్ ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి నుంచి రక్షించుకునే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నార్కెట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామ శివారులోని
12th బెటాలియన్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ వద్ద పలు కేసుల్లో పట్టుబడ్డ 1379 కిలోల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనా దీప్తి నిర్వీర్యం చేశారు.
గంజాయి విలువ రూ. కోటి 93 లక్షలు ఉంటుందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించిన వాడిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం బచ్చాపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తోటలో తరచూ ఆవులు మేత కోసం వస్తున్నాయని ఆ తోట యజమాని నీటి సంపులో విషప్రయోగం చేశాడు. ఎప్పటి లాగే మేతకు వచ్చిన పశువులు విషం కలిపిన నీళ్లు తాగడంతో 11 ఆవులు మృతి చెందాయి. మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చందంపేట మండలంలో చిరుత సంచరిస్తుందని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు తెలిపారు. అక్కడకు చేరుకున్న అధికారులు రైతులను ఆరాతీస్తున్నారు. పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.
చిట్యాల మున్సిపాలిటీలోని సంతోష్ నగర్ కాలనీలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ డీఎస్సీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఇంటిని కిరాయికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వరరావు బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 7న ఆన్ లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10గం.ల నుంచి 12గం.ల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2గంల నుంచి 4గం.ల వరకు 7- 10వ తరగతుల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ స్వరూప రాణి తెలిపారు.
భువనగిరి మున్సిపాలిటీ టీచర్స్ కాలనీ సమీపాన రైల్వే ట్రాక్ పై రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తెల్జీరి చిన్న యాదవ్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Sorry, no posts matched your criteria.