India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యాసంగిలో సాగు చేసిన వరిచేలు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. యాసంగి సీజన్లో బోరుబావులపై ఆధారపడి జిల్లా వ్యాప్తంగా 4,20,561 ఎకరాల్లో రైతులు వరినాట్లు వేసుకున్నారు. నీటి ఎద్దడి కారణంగా సుమారు 15 శాతం మేర వరిచేలు ( 60 వేల ఎకరాల్లో పొలాలు) ఎండిపోయాయి. దీంతో రైతులకు రూ.304 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ రాజకీయాల్లో నల్లగొండ పార్లమెంటుకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.
ఈనెల 30న నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని మఠంపల్లి మండల నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మఠంపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో జరుగు నల్గొండ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక వ్యక్తులు, రౌడీషీటర్లు, ట్రబుల్ మంగ్లర్స్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటు అక్రమ మద్యం, నగదు సరఫరా కాకుండా పటిష్ఠ నిఘాతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. నల్గొండలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. బీజేపీ కాంగ్రెస్‌కు ఎప్పుడూ బీ-టీమ్ కాదని స్పష్టం చేశారు. బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పనిచేస్తా తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగరేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.
ఒక్క తెలంగాణ కోసం తప్ప పార్టీని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టికెట్ల విషయంలో నేను కలుగజేసుకోను.. నేను పార్టీ కోసం పని చేస్తానన్నారు. మంత్రుల నివాస సముదాయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్‌లో వారు మాట్లాడారు. తన నియోజకవర్గం తన శాఖ తప్ప వేరేది పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ఆయన చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని ఎద్దెవ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రకారం వాహనాల తనిఖీల్లో భాగంగా సూర్యాపేటలో కేంద్ర పోలీసు బలగాలు సూర్యాపేట పోలీసులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కారును జాతీయ రహదారిపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువులు పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఎన్నికల నియమాలు ప్రకారం ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. వాహనం తనిఖీ అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తిరిగి ప్రయాణమయ్యారు.
బ్యాంక్ ఖాతా నుండి 7లక్షలు చోరీ జరిగిన ఘటన ముదిగొండ పంజాబ్ నేషనల్ బ్యాంకులో గురువారం జరిగింది. ముదిగొండ గ్రామానికి చెందిన మారుపాకల బాలయ్య అకౌంట్ నుండి 7లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో బ్యాంకు వారిని సంప్రదిస్తే ఆన్‌లైన్ ఫ్రాడ్ జరిగిందని, పూర్తి వివరాలు చెప్పడం లేదన్నారు. 20 రోజుల క్రితం మరో వ్యక్తి అకౌంట్ నుండి రూ.70వేలు డ్రా అయ్యాయని, బ్యాంక్ అధికారులు తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు లోక్‌సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ప్రారంభించాలని ఆయా పార్టీల అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో గ్రామాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది.
Sorry, no posts matched your criteria.