Nalgonda

News March 27, 2024

నల్గొండ: అంతా హస్తగతం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చండూరు, నేరేడుచర్ల, యాదగిరిగుట్ట మినహాయించి అన్నింట్లోనూ బీఆర్ఎస్‌కు ఆధిక్యం వచ్చింది. మిర్యాలగూడ, నకిరేకల్, చండూరు, ఆలేరు, పోచంపల్లి, సూర్యాపేటల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వారు ఛైర్మన్లు ఉన్నారు. వీటిని కూడా చేజిక్కుంచుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

News March 27, 2024

ఎస్సీ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్, RRB, SSC రాష్ట్ర స్థాయి& కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు డిగ్రీ చదివిన ఎస్సీ విద్యార్థులకు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి L. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 28న NLGలో గల విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్ లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

News March 26, 2024

‘రజాకర్’ సినిమా ఉచిత ప్రదర్శన

image

ఇటీవల విడుదలైన ‘రజాకార్’ సినిమాను వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్లో రేపు మార్నింగ్, మ్యాట్నీ షోలు వేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ సహకారంతో ఉచితంగా ప్రదర్శించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. మరుగున పడ్డ తెలంగాణ చరిత్రను రజాకార్ సినిమా ద్వారా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.

News March 26, 2024

జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.

News March 26, 2024

నల్గొండ జిల్లాకు KCR

image

మాజీ సీఎం కేసీఆర్ త్వరలో నల్గొండకు రానున్నారు. నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించనున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి పంటలను పరిశీలించి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంబంధిత నివేదికను KCRకు అందించారు. ఈ మేరకు జిల్లాలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.

News March 26, 2024

ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం.. తల్లి, కొడుకు మృతి

image

మునగాల మండలం ఆకుపాముల శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వెంకట నర్సయ్య అతని తల్లి రాంబాయమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు మేళ్లచెరువుకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 26, 2024

నల్గొండ: తండ్రి మరణం… ‘కూతురికి పరీక్ష’

image

తండ్రి చనిపోయిన బాధలోనూ ఓ విద్యార్థిని పదవ తరగతి పరీక్ష రాసిన ఘటన త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తవిడబోయిన చంద్రశేఖర్ అనారోగ్యంతో సోమవారం రాత్రి మరణించారు. శేఖర్ కూతురు గాయత్రి మంగళవారం తండ్రి చనిపోయిన బాధ దిగమింగి ఫిజిక్స్ ఎగ్జామ్ రాసింది. ఎగ్జామ్ రాసి వచ్చిన అనంతరం తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది.

News March 26, 2024

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  

image

మాజీ సీఎం KCRను కలిసిన నల్గొండ MP అభ్యర్థి  కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కలిశారు. ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను కలుపుకుని లోక్ సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ వారికి సూచించారు. ప్రజలతో మమేకమైతే తప్పకుండా విజయం సాధ్యమవుతుందని చెప్పారు. 

News March 26, 2024

రోడ్డుపై పసికందు.. వారిపైనే అనుమానం!

image

చండూరు పరిధిలోని బంగారిగడ్డలో ఓ పసికందును పడవేసిన ఘటన కలకలం సృష్టించింది. అయితే ఇది అవివాహితులు ఎక్కడో ప్రసవించి ఇక్కడ వదిలివేసి వెళ్లినట్లు ICDS అధికారులు అనుమానిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

News March 26, 2024

నేడు ధర్మభిక్షం వర్ధంతి

image

నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో ధర్మభిక్షం జన్మించారు. నిజాం నవాబు ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు. ప్రజలను చైతన్య పరిచేవారు. ధర్మభిక్షం 3సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు. కాగా ఇవాళ ధర్మభిక్షం వర్ధంతి.