India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
వరి కోతల తరువాత మిగిలిన కొయ్యలను కాల్చి బూడిద చేయడంతో ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్నారు. పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో భూమి విపరీతంగా వేడెక్కి భూసారం కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు కూడా మరణిస్తాయని తెలిపారు.

మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కంపసాటి వెంకన్న- అన్నపూర్ణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా పెద్దకుమార్తె సింధు కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యానికి రూ.10లక్షలు అవసరం కాగా, అప్పు చేసి రూ.3 లక్షలు వెచ్చించి వైద్యం చేయిస్తున్నామని వారు చెబుతున్నారు. ఇంకా రూ.7 లక్షలు అవసరమవుతుందని, దాతలు ఆదుకోవాలని కోరారు.

చింతలపాలెం మండలంలో శనివారం నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 14 MP సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని, ఈ ఎన్నికల తరువాత BRS అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు. బీజేపీని నమ్మే వాళ్ళు లేరని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను అండగా ఉంటానని తెలిపారు.

నాగార్జునసాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైంది. జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి శనివారం ఎమర్జెన్సీ పంపింగ్‌ను ప్రారంభించారు. మొత్తం పది పంపులతో నీటిని తోడేస్తున్నారు. సాగర్‌లో HYD నగర తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపింగ్ మొదలైనా, ఇంకా ఎమర్జెన్సీ పరిస్థితులొస్తే రెండో దశ ఎమర్జెన్సీ పంపింగ్ చేసేందుకు కూడా ఏర్పాట్లన్నీ చేసి సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఫుడ్ పాయిజన్‌పై కేంద్రం సీరియస్ అయింది. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ బృందాన్ని ఆదేశించింది. ఈనెల 22న భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకులానికి NCSC బృందం సభ్యులు రానున్నారు. ఫుడ్ పాయిజన్ పై కేంద్రానికి NCSC బృందం నివేదిక ఇవ్వనున్నది.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 23న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో వడగాల్పుల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వడగాల్పుల కారణంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. తాజాగా నల్గొండ మండలం చందనపల్లిలో కొండయ్య (50) వడదెబ్బతో మృతి చెందారు.

భువనగిరి లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తన నామినేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. చేతిలో నగదు బ్యాంకు డిపాజిట్ కలిపి రూ.7,74,90,802.26 ఉంది. భార్య పేరుపై రూ.1,45,60,147.82 ఉన్నాయి. స్థిరాస్తుల విలువ రూ.7,43,20,516, తన పేరుపై అప్పు రూ.1,28,17,844, తన భార్య పేరుపై రూ.1,93,83,212 ఉందని పేర్కొన్నారు.

నల్గొండ-నకిరేకల్ రహదారిలో తిప్పర్తి మండలం పెద్ద సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సుందర్ రావు సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం నల్గొండకు వస్తుండగా పెద్ద సూరారం వద్ద అడవి పందులు రోడ్డుకు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో సుందర్ రావు అక్కడికక్కడే మరణించారు.

పాలీసెట్-2024 ప్రవేశ పరీక్ష తేదీ షెడ్యూల్లో మార్పు జరిగినట్లు NLG పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి.జానకీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మే 17న జరగాల్సిన పరీక్ష 24వ తేదీకి మార్చినట్లు చెప్పారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కళాశాలలో సివిల్ మెకానిక్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ మూడేళ్ల డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.