India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రైలు పట్టాల సమీపంలో మంటలు వ్యాపించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి MLG సమీపంలోని కుక్కడం వద్ద చోటు చేసుకుంది. కుక్కడం వద్ద రైలు పట్టాల సమీపంలో రైతులు ఎండిపోయిన వరి కొయ్యలకు నిప్పుపెట్టడంతో మంటలు క్రమంగా వ్యాపిస్తూ రైలు పట్టాల వద్దకు వచ్చాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న రైల్వే సిబ్బంది గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నిలిపివేశారు.

తాగునీటి విషయంలో జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నల్లగొండ మిషన్ భగీరథ పర్యవేక్షక ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ టేయిల్ పాండ్ రిజర్వాయర్లో 2.92 టీఎంసీల నీరు, అలాగే ఉదయ సముద్రం రిజర్వాయర్లో 1.10 టిఎంసిల నీరు నిలువ ఉందని అన్నారు. ఈ నీరు రాబోయే
4 నెలల పాటు జిల్లాలోని ప్రజలకు తాగునీటికి ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తామని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లను లాగించేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండడంతో అదే స్థాయిలో బీర్ల విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతులకు బ్యూటీపార్లర్ కోర్స్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు SBI RSET డైరెక్టర్ ఈ.రఘుపతి శుక్రవారం తెలిపారు. 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన, వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీలోపు నల్గొండ పట్టణంలోని రామ్ నగర్ లో గల SBI RSET కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్గొండ BRS నేత సందినేని జనార్దన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.

కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు శుక్రవారం పశువులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. కాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగడం కోసం బావిలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు , అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం- 12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో NLG పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండో రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు, మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) తరఫున వసుకుల మట్టయ్య, కిన్నెర యాదయ్య స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కోసెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు (55) జిల్లాలో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు రాంబాబును మిర్యాలగూడ లో పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల 24 వేల విలువ గల 20 తులాల 3 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్‌లోని 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ ఆదిభట్ల పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్ పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.