India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తుంగతుర్తిలో క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బాపన్ బాయి తండా ఎక్స్ రోడ్‌లో పసుపు కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో చేసిన క్లాత్‌తో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రాత్రి చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.

భువనగిరి పార్లమెంట్ స్థానానికి సీపీఐ (ఎం) పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ వేశారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, నాయకులు కొండమడుగు నరసింహలతో కలిసి రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

భువనగిరి మండలం పెంచికలపాడులోని బాల్దా రాములుకు చెందిన గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. దీంతో గ్రామస్థులంతా ఆ గొర్రె పిల్లను చూడడానికి వచ్చారు. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. కాగా పుట్టిన కాసేపటికే గొర్రె పిల్ల చనిపోయింది.

భారతదేశ ప్రధాని మోదీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు, మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదేళ్ల లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.

లోక్ సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయ పరిధిలో 144 సెక్షన్ విధించినట్లు రాచకొండ భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం ఏర్పాటు చేసినందున కలెక్టరేట్ ప్రాంగణం బయట 100 మీటర్ల వరకు ఈ నిబంధన వర్తిస్తుందని ఐదుగురు కన్నా ఎక్కువమంది గుమిగూడరాదని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 29 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు.

పశువుల కొవ్వు నుంచి నూనె తయారు చేసిన నూనెను కోదాడలో పోలీసులు పట్టుకున్నారు. 45 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాము తెలిపారు. షేక్.యాదుల్ అనే వ్యక్తి మటన్ దుకాణం నడుపుతుంటాడని.. నూనె తయారు చేసి HYDలో అమ్మేందుకు ఇంట్లో డంపు చేయగా పట్టుకున్నామన్నారు.

ఉమ్మడి జిల్లాలో అంగన్వాడీలు జీతం కోసం ఎదురు చూస్తున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నెల ముగింపునకు వస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.18 వేలు చెల్లిస్తామని అంగన్వాడీలకు హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఈ హామీని వెంటనే అమలు చేయాలని సీఎంను అంగన్వాడీలు కోరుతున్నారు.

నల్గొండ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్ సభ స్థానాలకు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే ఈనెల 25న నామినేషన్ల కార్యక్రమం అనంతరం ప్రచార సభలకు ఆయా పార్టీల అగ్రనేతలు నల్గొండ, భువనగిరికి రానున్నారు.

డిండి మండలంలోని ఓ తండాకు చెందిన బాలికను నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం మర్రిపల్లి తండాకు చెందిన అంగోత్ వినోద్ ప్రేమ పేరుతో అపహరించి పలుమార్లు బెదిరించి, ఆమెపై అత్యాచారం చేశారు. 2023 ఫిబ్రవరి 20న మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితునికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.53 వేలు జరిమాన విధిస్తూ న్యాయమూర్తి బి.తిరుపతి తీర్పు ఇచ్చారు.

నల్గొండ లోక్ సభ స్థానానికి తొలిరోజు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హరిచందనకు పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి సైదిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ ప్రభాకర్, సోషలిస్టు పార్టీ తరఫున రచ్చ సుభద్రారెడ్డి, ప్రజావాణి పార్టీ తరఫున లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. యాదాద్రి నుంచి ముగ్గురు నామినేషన్ వేశారు.
Sorry, no posts matched your criteria.