Nalgonda

News March 24, 2024

భర్తను హత్యచేయించిన భార్య

image

తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు కిరాయి వ్యక్తులతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. భార్య, ఐదుగురు నిందితులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2బైకులు, కారు, పుస్తెలతాడు,5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 24, 2024

మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

image

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్ లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

News March 24, 2024

సూర్యాపేట: వింత గుడ్లగూబ ప్రత్యక్షం

image

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరిలో వింత గుడ్లగూబ ప్రత్యక్షమైంది. దీనిని బార్ను గుడ్లగూబ అంటారని, ఇది ఎడారి ప్రాంతాలు హిమాలయాలకు ఉత్తరాన ఉన్న ఆసియా, ఇండోనేషియాలోని కొన్ని దీపాలలో మాత్రమే కనిపిస్తాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దాని ముఖం మనిషి పోలిక ఆకారంతో ఉండడంతో దీన్ని చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

News March 24, 2024

నల్గొండలో రసవత్తర పోరు

image

నల్గొండ నుంచి ప్రధాన పార్టీలు తమ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ముగ్గురు ఆర్థికంగా బలం ఉన్న నాయకులే. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుందని నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

News March 24, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

News March 24, 2024

NLG: ప్రయాణికుల కనీస సౌకర్యాలు పట్టని ఆర్టీసీ

image

ఉమ్మడి జిల్లాలో RTC బస్సుల్లో ప్రయాణించే వారికి భద్రతతోపాటు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్లలో తాగునీరు, బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సులు కనిపించని పరిస్థితి నెలకొంది. బస్సుల్లో ప్రయాణించే వారి టికెట్ పై పల్లె వెలుగుల్లో రూ.2, ఇతర బస్సుల్లో రూ.6 చొప్పున సెస్ రూపంలో వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరానికి కోట్లాది రూపాయలు సమకూరుతున్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు, భద్రత కల్పించడం లేదు.

News March 24, 2024

మిర్యాలగూడ విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి 

image

రాజ్యాంగ విలువలను కాపాడటానికి ఏర్పడిన పౌర సమాజ వేదిక జనగణమన అభియాన్ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుత దేశంలో ‘రాజ్యాంగ విలువల పరిస్థితి ప్రజల కర్తవ్యం’ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో MLG కేఎన్ఎం డిగ్రీ కళాశాల విద్యార్థిని ఎండీ. యాస్మిన్ మొదటి బహుమతి సాధించింది. ప్రొఫెసర్ హరగోపాల్ ప్రైజ్ అందజేశారు.

News March 23, 2024

BRS పార్టీకి తేరా చిన్నపరెడ్డి రాజీనామా

image

BRS పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి రాజీనామా చేశారు. శనివారం రాజీనామా లేఖను బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు పంపారు. నల్గొండ పార్లమెంటు స్థానాన్ని ఆశించిన తేరా చిన్నపురెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కేటాయించకపోవడంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు.

News March 23, 2024

భువనగిరిపై వీడని పీటముడి!

image

కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ స్థానంపై పీటముడి ఇప్పట్లో వీడేల లేదు. ఇక్కడి నుంచి పోటీకి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఉన్నతస్థాయిలో చర్చలు సైతం పూర్తయ్యాయని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కిరణ్‌కుమార్‌రెడ్డికి వస్తుందా? లేదా పార్టీలోని మరో ప్రజాప్రతినిధికి వస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.

News March 23, 2024

నల్గొండ, భువనగిరిపై తర్జనభర్జన

image

నల్గొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ తర్జనభర్జన పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ కత్తిమీద సాములా మారింది. ఇప్పటివరకు విజయం సాధించని నల్గొండ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాజధాని ప్రాంతం కాకుండా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న స్థానాలు ఇక్కడివే కావడం గమనార్హం.