Nalgonda

News July 25, 2024

NLG: రైతు బీమాకు ఆగస్టు 5 వరకు గడువు

image

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, గతంలో రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు వచ్చేనెల ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఏఓ పాల్వాయి శ్రవణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఆయా గ్రామాల ఏఈఓలకు అందజేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 25, 2024

జిల్లా వ్యాప్తంగా 109 ఖాళీలు.. భర్తీపై మళ్లీ ఆశలు!

image

గతనెలలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిపోయిన 109 ఖాళీలను మళ్లీ పదోన్నతులతో భర్తీ చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో పదోన్నతులపై ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఒక్కో ఉపాధ్యాయుడు రెండు నుంచి మూడేసి పోస్టుల్లో పదోన్నతి పొంది ఒక పోస్టులో జాయిన్ కావడంతో మిగతావి ఖాళీగా మిగిలిపోయాయి. కొందరు పదోన్నతి పొంది కూడా పోస్టు వద్దని రాసిచ్చారు.

News July 25, 2024

కాంగ్రెస్ తొలి బడ్జెట్.. ఉత్తమ్, కోమటిరెడ్డి నిధులు తెస్తారా!

image

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి మంత్రులుగా ఉండడంతో జిల్లాకు ప్రయారిటీతో పాటు అధిక నిధులు వస్తాయని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది.

News July 25, 2024

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తోంది..

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్వంగా వరద వస్తోంది. ప్రాజెక్టు సమాచారమిలా..
ఇన్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 9,500 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 503.80అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 121.3844 టీఎంసీలు

News July 25, 2024

గంజాయి తీసుకుని 45 రోజులైనా గుర్తిస్తాం: CI శ్రీధర్ రెడ్డి

image

గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ఇప్పుడు ప్రత్యేక కిట్టునే ఉపయోగిస్తోంది. ”గంజాయి తాగే వారిని గుర్తించేందుకు ఎబాన్‌ డ్రగ్‌ యూరిన్‌ టెస్టింగ్‌ కిట్‌ను ఉపయోగిస్తున్నాం. 45 రోజులైనా ఇది గంజాయి తీసుకున్న వారిని గుర్తిస్తుంది. అనుమానం వచ్చిన ప్రతీ వ్యక్తి యూరిన్‌ను పరీక్ష చేసి నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం. గంజాయి నిర్మూలనకు ప్రతీ ఒక్క పౌరుడు సహకరించాలి” అని కోదాడ సీఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు.

News July 25, 2024

26 నుండి ఇంటింటి జ్వర సర్వే: కలెక్టర్

image

ఈనెల 26 నుండి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో “ఇంటింటి జ్వర సర్వే” నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. “ఇంటింటి జ్వర సర్వే” లో భాగంగా తక్షణమే మెప్మా సిబ్బంది, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

News July 24, 2024

అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య

image

తిప్పర్తి: అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మామిడాలలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మి(40) అప్పులు అధికం కావడంతో తీర్చలేక మనస్తాపానికి గురై ఈనెల 21న పురుగు మందు తాగింది. నల్లగొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 24, 2024

అన్నపూర్ణ క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెడుతున్న రూ.5ల భోజనాన్ని పరిశీలించారు. భోజనం చేస్తున్న వారిని భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలలో పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 24, 2024

KTRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

image

హైదరాబాద్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRని మాజీ మంత్రి గుంత కండ్ల జగదీశ్ రెడ్డి కలిశారు. బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువ కప్పి సన్మానం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.

News July 24, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
ఇన్ ఫ్లో : నిల్
ఔట్ ఫ్లో: 8,714 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుతం: 503.60 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.5050 టీఎంసీలు
ప్రస్తుతం: 121.0608 టీఎంసీలు
కుడి కాలువకు: 5,496 క్యూసెక్కులు
ఎడమ కాలువకు: 2,818 క్యూసెక్కులు
మాధవరెడ్డి ప్రాజెక్టుకు: 400 క్యూసెక్కులు