India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.

నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. DEO బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో మొత్తం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 489 పాఠశాలలకు చెందిన 19,835 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 10,143 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉండగా, 137 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.

మెనూ ప్రకారమే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం NLGలోని ఎస్ఎల్బీసీ మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్‌లోని గదులను వంట గదిని పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులను వంట బాగుందా?.. మెనూ ప్రతిరోజు అమలు చేస్తున్నారా?.. అని అడిగి తెలుసుకున్నారు.

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులతో బుధవారం నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. జిల్లాలో నేర నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు, స్వయం సహాయక మహిళ సంఘాలకు, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు రుణ పంపిణీలో చొరవ చూపాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమావేశ మందిరంలో నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.

నల్గొండ: జనాభా అన్నింటికీ ప్రామాణికం అని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో 2027 జనగణనపై ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక దేశానికి జనగణన అతి ముఖ్యమని, ముఖ్యంగా దేశ అభివృద్ధి జనాభాపైనే ఆధారపడి ఉంటుందని, ప్రజలకు అవసరమైన పథకాల రూపకల్పనలో, అలాగే ఇతర అంశాలలో జనాభా కీలక పాత్ర వహిస్తుందన్నారు.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశపడే ఎస్సీ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు నల్గొండ జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు (డి.డి) బి.శశికళ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 ఆఖరి గడువు.

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం 109 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది మొత్తం 19,845 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 19,698 మంది రెగ్యులర్ కాగా, 137 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. గతంలో ఉన్న ఒక్క నిమిషం నిబంధనను ఈసారి సడలించారు.

జిల్లాలో కొత్త మున్సిపల్ కౌన్సిళ్లు ఏర్పడి రోజులు గడుస్తున్నా, ఇంతవరకు సమావేశాల ఊసే లేకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఆమోదానికి కేవలం 20 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పాలనపై ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఆమోదం పొందుతామని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.