Nalgonda

News August 17, 2024

చెరువుగట్టు భక్తులకు అమావాస్య కష్టాలు

image

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అమావాస్య కష్టాలు తప్పడం లేదు. రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక అమావాస్య రోజుల్లో నిత్యం ఇక్కడ రాత్రి బస్సు చేయడానికి సుమారు 50 వేల మందికి పైగానే వస్తున్నారు. ఆలయానికి భారీగా ఆదాయం వస్తున్నా.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ యంత్రాంగం విఫలమవుతోంది.

News August 17, 2024

NLG: అయోమయంలో అంగన్వాడీ ఆయాలు!

image

ఉమ్మడి జిల్లాలో ICDS ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు ఆయాలు రెండు నెలలుగా అయోమయంలో పడ్డారు. గత మే మాసంలో ప్రభుత్వం 65 ఏళ్లు పైబడిన ఆయాలతో పాటు టీచర్లతో ఉద్యోగ విరమణ చేయించాలని నిర్ణయించింది. అయితే ఆయాలకు విద్యార్హత సర్టిఫికెట్లు లేకపోవడంతో వారిని ఉద్యోగ విరమణ చేయించడం అధికారులకు తలనొప్పిగా మారింది. అధికారుల అంచనా ప్రకారం కొందరిని 65ఏళ్ల పైబడిన వారిగా గుర్తించారు.

News August 17, 2024

రుణమాఫీ నోడల్ అధికారుల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం మూడు దఫాల్లో చేసిన రుణమాఫీ కొందరు రైతులకు అంద లేదు. దీనిపై జిల్లా వ్యాప్తంగా 12,966 మంది రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మూడు విడతల్లో మాఫీ కాని రైతుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల వ్యవసాయ అధికారిని నోడల్ అధికారిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. వీరికి రెండు మూడు రోజుల్లో రుణమాఫీకి సంబంధించిన లాగిన్ ఇవ్వనున్నారు.

News August 17, 2024

నాగార్జునసాగర్ సమాచారం

image

➽పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
➽ప్రస్తుత నీటిమట్టం: 590 అడుగులు
➽ఇన్ ఫ్లో: 79,535 క్యూసెక్కులు
➽ఔట్ ఫ్లో: 79,535 క్యూసెక్కులు
➽విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా: 29,150 క్యూసెక్కులు
➽కుడికాల్వ ద్వారా : 8,067 (క్యూసెక్కులు)
➽ఎడమ కాల్వ ద్వారా: 7,518
➽ఏఎమ్మార్పీకి : 1800
➽వరద కాల్వకు: 600

News August 16, 2024

నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత

image

ఎగువన కురిసిన భారీ వర్షాలకు నాగార్జునసాగర్‌కు వరద నీరు చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి వేశారు. ఐదు అడుగుల మేరకు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలువల నుంచి ఆయకట్టు భూములకు నీటిని వదిలారు. సమాన స్థాయిలో ఇన్‌ ఫ్లో, ఔట్ ఫ్లో ఉంది.

News August 16, 2024

BREAKING: చౌటుప్పల్: 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు..!

image

గంజాయి ముఠాను సుమారు 34 కిలోమీటర్లు ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. HYD-విజయవాడ హైవేలోని పతంగి టోల్ ప్లాజా వద్ద నలుగురు సభ్యులున్న ఓ గంజాయి ముఠాను నల్గొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు ఈరోజు పసిగట్టారు. అక్కడ వారిని అడ్డుకోగా కారుతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకోవడంతో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వెంబడించి HYD శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ JNNURM వద్ద అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిను సీజ్ చేశారు.

News August 16, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ డ్యాం రెండు గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు కొనసాగించారు. శ్రీశైలం నుంచి 63,129 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి చేరుతోంది. నీటిమట్టం గరిష్ట స్థాయి 590 అడుగులకు చేరడంతో ఎన్ఎస్పీ అధికారులు రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు.

News August 16, 2024

నల్గొండ జిల్లాలో 33,501 మంది రైతులకు రుణమాఫీ

image

రూ.2లక్షల లోపు పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో భాగంగా మాఫీ చేసింది. ఈ మేరకు గురువారం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 33,501 మంది రైతులకు రూ.442.86 కోట్లు విడుదలయ్యాయి. అయితే గురువారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రైతుల ఖాతాల్లో ఆ నిధులు జమకాలేదు. శుక్రవారం ఉదయం రైతు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

News August 16, 2024

నల్గొండ: రైతుల కోసం అద్భుత యంత్రం

image

రైతుల కోసం చౌటుప్పల్ పురపాలిక లింగోజిగూడేనికి చెందిన ప్రవీణ్ అద్భుత యంత్రాన్ని సృష్టించాడు. రాత్రి పూట రైతులు కాపలా లేని సమయంలో వచ్చే దొంగలతో పాటు అడవి పందుల నుంచి రక్షణ కల్పించే పరికరాన్ని కనిపెట్టాడు. దీనిని వ్యవసాయ క్షేత్రం వద్ద, తాళం వేసిన ఇంటికి అమరిస్తే ఎవరైనా అక్కడికి వస్తే అలారం మోగుతుంది. రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో చోరీలను అరికట్టవచ్చు.

News August 15, 2024

నల్గొండ జిల్లాలో 24 కొత్త గ్రామ పంచాయతీలు

image

నల్గొండ జిల్లాలో మరికొన్ని పంచాయతీలు ఏర్పడనున్నాయి. గత ప్రభుత్వం తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో మరికొన్ని గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసింది. జిల్లాలో కొత్తగా 24 గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి.