India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాక కోసం పల్లె ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామాలకైతే బస్సు సౌకర్యమే లేదు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో స్టాప్‌లలో మహిళలు ఎక్కువగా ఉంటే ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు స్పందించి బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్‌లో ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్’ నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చర్యలు చేపట్టింది. చిన్నారుల అభ్యున్నతి కోసం అంకితభావంతో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత విద్యుత్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కనెక్షన్ల ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 2,093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.

NLG జిల్లాలో మార్చి ఆరంభంలోనే ఎండలు ముదురుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, ఫ్యాన్ల వాడకాన్ని పెంచేశారు. దీంతో గృహ వినియోగ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో వినియోగం గణనీయంగా పెరగ్గా, ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో వినియోగదారులు విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలంటున్నారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత కీలకంగా సాగింది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బీ.చంద్రశేఖర్ పాల్గొని జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని CM ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

దేవరకొండ ఉప్పవాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తికేయన్ మృతి చెందాడు. స్నేహితులతో కలిసి హోలీ ఆడేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొన్నారు. విద్యార్థి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చనిపోయాడు. మరో విద్యార్థి శ్రీనివాసచారి పరిస్థితి విషమంగా ఉంది.

జిల్లాలో యాసంగి (రబీ) సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు యంత్రాంగం సిద్ధమవుతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ ముగిసిన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ధాన్యం సేకరణపై జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 4.91 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 15 కార్యాలయాల్లో సగానికి పైగా చోట్ల రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేరు. మునుపెన్నడూ లేని విధంగా సిబ్బంది కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీనియర్ అసిస్టెంట్లే ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు డీఆర్‌లు సైతం ఎఫ్ఏసీలే కావడం గమనార్హం.

జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 441 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 12,758, మంది విద్యార్థులకు గాను 12455 మంది హాజరుకాగా, 303 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1964 మంది విద్యార్థులకు గాను 1826 మంది హాజరుకాగా, 138 మంది గైర్హాజరయ్యారు.

జిల్లాలో రానున్న కఠిన వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.