India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగలను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు 23.53 లక్షల విలువ గల 31 తులాల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, రూ.28 వేల నగదు, హోండా యాక్టీవా స్కూటీ, ఇనుప రాడ్డు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
వ్యాపార సముదాయ యాజమాన్యాలు, దుకాణదారులు ఉపయోగించే సింగిల్ యూజ్ కవర్లపై నిషేధం విధించినట్లు చండూరు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అరుణా కుమారి, శానిటరీ ఇన్స్పెక్టర్ సాయి, అరవింద్ పాల్గొన్నారు.
హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన డబ్ల్యుపీఎల్ సెలక్షన్స్‌లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి చిట్టి భవాని ఎంపికైనట్లు కోచ్ షేక్ సిద్దిఖ్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భవాని పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భవానీని అభినందించారు.
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవూర మండలం చింతపల్లి తండాలో జరిగింది. గ్రామానికి చెందిన జటావత్ కృష్ణ పది ఎకరాల్లో బత్తాయి తోటలో నీటి కోసం బోర్లు వేయించగా బోర్లలో నీరు పడకపోవడంతో పంట ఎండి పోవడానికి వచ్చింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి. మనస్థాపంతో కృష్ణ పురుగుల మందు తాగి మృతి ఆత్మహత్య చేసుకున్నాడు.
కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా జలాశయాలు నిండు కుండలా మారాయి. వరద భారీగా రావడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా వారం రోజుల్లో 120టీఎంసీల నీరు దిగువకు వెళ్లింది. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తగా 12న మధ్యాహ్నం గేట్లు మూసివేశారు.
సెప్టెంబర్ 1 నుంచి జిల్లా మొదలుకొని గ్రామపంచాయతీ వరకు ఉద్యోగులకు అటెండెన్స్ యాప్‌ను నిర్వహించనున్నామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారులు సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సమయానుకూలంగా పనిచేయాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ.పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ పాల్గొన్నారు.
యాదాద్రి: చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-డీసీఎం ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలిపేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం అన్ని గేట్లను మూసి వేశారు. నాగార్జునసాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 588.80 అడుగులుగా ఉంది. అదే విధంగా గరిష్ఠ నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 305.46 టీఎంసీలు ఉన్నాయి.
“నేను గంజాయి వాడను” అనే నినాదంతో ఈ నెల 14 నుండి వారం రోజుల పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా NLGను తీర్చి దిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన “మిషన్ పరివర్తన్” కార్యక్రమం కింద సోమవారం కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన SLBC టన్నెల్ పనులను రాబోయే 2ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి ఈరోజు ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోంతో కలిసి సందర్శించారు.
Sorry, no posts matched your criteria.