India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లగొండ పోలీస్ శాఖ, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం ఎన్జీ కళాశాలలో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. క్రీడాభిమానులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.
MG యూనివర్సిటీ తెలుగు, ప్రాచ్య భాషల పాఠ్యప్రణాళిక మండలి ఛైర్మన్‌గా కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్, నకిరేకల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.బెల్లి యాదయ్య నియమితులయ్యారు. ఈ మేరకు MG యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండేళ్ల పాటు బెల్లి యాదయ్య ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో కోళ్లను పారేసిన కేసులో కోళ్ల ఫామ్ యజమాని రమావత్ రాజమల్లుని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. పడమటి తండా సమీపంలో ఉన్న కోళ్ల ఫామ్‌లో వైరల్ ఫీవర్‌తో చనిపోయిన కోళ్లను రిజర్వాయర్‌కు వచ్చే కాలువలో పడవేశాడని, జలాశయంలోని నీటితో ఎలాంటి ప్రమాదం లేదని ASP తెలిపారు.
మర్రిగూడ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం <<15462226>>సర్వేయర్ రవి<<>> లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ కార్యాలయంలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ధరణిలో జరిగిన అక్రమ భూరిజిస్ట్రేషన్‌లపై ఆఫీసర్లు సిబ్బంది నుంచి కూపీ లాగుతున్నారు. ఆఫీస్‌లోని రికార్డులను పరిశీలిస్తున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఆధారంగా అన్ని గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎంపీడీఓలను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఉదయాదీత్య భవన్‌లో ఎంపీడీవోలతో నమూనా ఇందిరమ్మ గృహాల నిర్మాణం, గ్రామాల వారీగా అర్హులైన లబ్ధిదారుల జాబితా తయారీ, తదిత అంశాలపై సమీక్షించారు. ఈనెల 20నాటికి అన్ని గ్రామాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి గ్రామంలో జరిగే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు సూర్యాపేట డిపో నుంచి 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా RM కే.జానిరెడ్డి తెలిపారు. పెద్దగట్టు జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఇవాళ వే2న్యూస్‌లో వార్త పబ్లిష్ కావడంతో అలర్ట్ అయిన అధికారులు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో దేవరకొండ ఆర్డీఓ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. కాగా, ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
MG యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కే.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సేవలు అందించనున్న అరుణ ప్రియ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రిజర్వాయర్‌ను దేవరకొండ RDO రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. రిజర్వాయర్‌లో కోళ్లను ఎవరు పడేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.