Nalgonda

News February 18, 2025

నేడు పెద్దగట్టు జాతరలో చంద్రపట్నం

image

పెద్దగట్టు జాతరలో నేడు మూడోరోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

News February 18, 2025

నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

image

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News February 18, 2025

నర్సరీల పెంపకం వేగవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

image

రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 17, 2025

ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

image

NLG: ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఎస్ఓ లు,ఎంఈఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు,ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో అత్యవసర పనులు అయితే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.

News February 17, 2025

 NLG: ఫైనాన్స్, భార్యాభర్తల సమస్యలపై వినతులు

image

NLG: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రోజు భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలపై వినతులు సమర్పించారు.

News February 17, 2025

MGU: బీఓయస్‌గా డా.బెల్లి యాదయ్య

image

MG యూనివర్సిటీ తెలుగు శాఖకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్ పర్సన్‌గా డాక్టర్ బెల్లి యాదయ్య బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బెల్లి యాదయ్య ప్రస్తుతం నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన ఆచార్యులుగా, తెలుగులో అసోసియేట్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా MG యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్ కళాశాల డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిలు ఆయన్ను ప్రశంసించారు.

News February 17, 2025

NLG: రాష్ట్రం నుంచి ఏకైక ప్లేయర్.. SP అభినందన 

image

ఈనెల 14, 15న బెంగళూరులో జరిగిన ఫుట్‌బాల్ సౌత్ ఇండియా సెలక్షన్స్ ట్రయల్స్‌లో సూపర్ ఆటతో ఆకట్టుకున్న రాచూరి వెంకటసాయిని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం అభినందించారు. కాగా, NLG ఛత్రపతి శివాజీ ఫుట్‌బాల్ క్లబ్‌కి చెందిన సాయి మార్చి 8,9 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్ రౌండ్ సెలక్షన్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటసాయి అని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తెలిపారు.

News February 17, 2025

కట్టంగూర్: జేఈఈ ఫలితాల్లో 91.38 % సాధించిన సిరి

image

కట్టంగూర్ మండలం ఐటి పాముల గ్రామపంచాయతీ పరిధి గంగాదేవి గూడెంకి చెందిన కంబాలపల్లి సిరి ఇటీవలే విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో 91.38% సాధించింది.  ఐటిపాముల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సిరి ప్రస్తుతం నల్గొండలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. సిరి 91.38% సాధించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News February 17, 2025

దేవరకొండ: మద్యం మత్తులో యువకుడిపై దాడి

image

మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన దేవరకొండలో జరిగింది. సీఐ నర్పింహులు ప్రకారం.. T.పాత్లావాత్‌తండాకు చెందిన శరత్ ఇంటి ముందు నుంచి ఓ యువకుడు రెండు, మూడు సార్లు నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న శరత్ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావంటూ కోపంతో కత్తితో దాడి చేశాడు. గాయాలైన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News February 16, 2025

పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

image

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.