India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిర్యాలగూడ మండలం నందిపాడలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ను బీజేపీ నాయకులు మదన్మోహన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రచయిత, దర్శకులు అంజి అయాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శివాలయ నిర్మాణానికి వారాహి సంస్థ తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రవీంద్ర కుమార్, వీటి యాదవ్, భార్గవ్, గిరి, రవి శంకర్, చారి పాల్గొన్నారు.
నల్గొండలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి వాచ్, ఎడమ చెవికి రింగు ఉందని వారు తెలిపారు. ఘటనా స్థలంలో చెప్పులు, బ్యాగు, పర్సు ఉన్నాయన్నారు. మృతుడిని గుర్తిస్తే నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70141కు సమాచారం ఇవ్వాలన్నారు.
తాను పెంచుకుంటున్న నాటుకోళ్లు మృతి చెందాయని ఓ మహిళ కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాలిలా.. గుడిబండకు చెందిన నర్సింగోజు గీత నాటు కోళ్లను పెంచుతోంది. అడ్లూరుకు చెందిన కోటిరెడ్డి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అతను ఎలుకల మందు పెట్టడంతో 38 కోళ్లు మృతిచెందాయని .. న్యాయం చేయాలని పోలీసులను గీత కోరింది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బొల్లారం కవిత భర్తతో ద్విచక్ర వాహనంపై hyd నుంచి వాసాలమర్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త,కొడుకు, బిడ్డకు గాయాలయ్యాయి.
మాడుగులపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మండల దుర్గయ్య, వెంకటమ్మ కుమారుడు శివ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన TGSPSC ఫలితాల్లో నీటిపారుదల శాఖ AEE గా ఎంపికయ్యాడు. రైతు కుటుంబం నుండి ఉన్నత చదువులు చదివి, AEE గా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని డిపోల నుంచి నాగార్జునసాగర్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్ తెలిపారు. ప్రతి డిపో నుంచి ప్రత్యేక బస్సులు సాగర్‌కు వెళతాయన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తించదని, ప్రయాణికులంతా టికెట్ ధర చెల్లించాలని పేర్కొన్నారు. ఏడు డిపోల నుంచి శని, ఆది వారాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
నాగార్జునసాగర్ డ్యాం గేట్లు ఎత్తినందున ఆగస్టు 10, 11 తేదీలలో ఉమ్మడి నల్లగొండ రీజినల్‌లోని అన్ని ఆర్టీసీ డిపోల నుండి సాగర్‌కి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని ఉమ్మడి నల్గొండ ఆర్ఎం M. రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం, ఆదివారం పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
తెలంగాణ BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు NLG BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ K.విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లో శిక్షణతోపాటు ఉపకార వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.
నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం చింతల్ తండాకు చెందిన రామావత్ రాందాస్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ఎస్ఎస్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020, 2021లో, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2022, 2023లో అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కేంద్ర హోం శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ బెంగుళూరులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.
Sorry, no posts matched your criteria.