India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోధన్, కాచిగూడ ప్యాసింజర్ రైలును శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. మూడు నెలల క్రితం ఈ రైలును రద్దు చేశారు. ఈ రైలు బోధన్ నుంచి కాచిగూడ, మహబూబ్‌గర్ మీదుగా గుంతకల్ వరకు నడుస్తుంది. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి రోజు ఉదయం 5:30 గంటలకు బయలుదేరి కాచిగూడ స్టేషన్ మీదుగా 11 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బోధన్‌కు చేరుకుంటుంది.
కామారెడ్డి జిల్లాలో ప్లూ, విషజ్వారాలకు తోడు డెంగ్యూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. జులై నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 62 డెంగీ కేసులు నమోదయ్యాయి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరిగింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో సైతం డెంగ్యూ పంజా విసురుతోంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులకు నిరసనగా బోధన్ పట్టణంలో నేడు బంద్ చేపట్టాలని హిందూ ఐక్య వేదిక పిలుపునిచ్చింది. అలాగే ఆర్మూర్ బంద్‌కు సర్వసమాజ్ పిలుపునిచ్చింది బాల్కొండ, ముప్కాల్, ఎడపల్లి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్ మండలంలో నేడు బంద్ చేపట్టనున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి బంద్ కు సహకరించాలని కోరారు.
కామారెడ్డి పట్టణంలో శుక్రవారం సాయంత్రం సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నిజాంసాగర్ చౌరస్తా నుంచి జీవదాన్ వెళ్లే దారిలో లయోల స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చిన డ్రైనేజీ నీటితో రోడ్డు మొత్తం నిండిపోయి చెరువును తలపించింది.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించడం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పీజీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటనకు నిరసనగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
NZB కమిషనరేట్ పరిధిలోని ఇటీవల 8 మంది సీఐలను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దయ్యాయి. ఐజీ ఆఫీస్ ఆదేశాలతో సీపీ కార్యాలయం అధికారులు విడుదల చేసిన కౌంటర్ డీవోను నిలిపివేశారు. బదిలీ అయిన సీఐలకు ఫోన్ చేసి ప్రస్తుత స్థానాల్లో యథావిధిగా కొనసాగాలని, రిలీవ్ కావొద్దని సూచించారు. కాగా సీఐల పోస్టింగుపై వివాదం ఏర్పడడం, రాజకీయ నేతల జోక్యం కారణంగా ఉత్తర్వులు రద్దయినట్లు డిపార్ట్మెంట్‌లో చర్చ జరుగుతోంది
నిజాంసాగర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం..అచ్చంపేట్ గ్రామానికి చెందిన బాబు (21) గ్రామ శివారులో గెదేలను మేపడానికి వెళ్లాడు. కాగా అక్కడే ఉన్న గంగసాని కుంటలో ప్రమాదవశాత్తు బాబు జారిపడి ఈతరాక మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
బోధన్- కాచిగూడ రైలు పునఃప్రారంభం కానుంది. శుక్రవారం రాత్రి నుంచి కాచిగూడ- బోధన్ ప్యాసింజర్ రైలు నడవనుంది. అదేవిధంగా శనివారం ఉదయం నుంచి బోధన్ కాచిగూడ రైలు పునః ప్రారంభంకానుంది. ఇకపై ఈ రైలు ఎలక్ట్రిక్ ఇంజన్‌తో నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోజుకో అబద్ధపు ప్రకటనలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ BRS కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రైతులు ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాయన్నారు.
పిట్లం మండలం చిన్నకొడప్గల్ శివారు హైవే పై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పిట్లం వాసి జబ్బర్ మృతి చెందాడు. వివరాలు ఇలా.. జబ్బర్ పని నిమిత్తం బైక్ పై చిన్న కొడప్గల్ గ్రామానికి వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో గేదెలు అడ్డు రావడంతో అదుపు తప్పిపడ్డాడు. తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.