Nizamabad

News August 16, 2024

NZB: రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారు: ఎమ్మెల్యే

image

సీఎం రేవంత్ రెడ్డి రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబరు 9న ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని ఒకసారి మళ్లీ 100 రోజుల్లో అని మళ్లీ దేవుళ్లపై ప్రమాణం చేసి ఆగస్టు 15లోపు చేస్తానని మాట ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు. 36 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికే మాఫీ అయ్యిందన్నారు.

News August 16, 2024

NZB: ముడో విడతలో రైతులకు రుణమాఫీ.!

image

రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో 11,411రైతు కుటుంబాలకు గాను 15,724 లోన్ ఖాతాలు అర్హత పొందడ సుమారు రూ.190.33కోట్లు ప్రభుత్వం మాఫీ చేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మండలాలు, గ్రామాల వారీగా లబ్దిదారుల పేర్లు వ్యవసాయశాఖకి అందలేదు. దీంతో 2 లేదా 3 రోజుల్లో రైతుల లోన్ అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

News August 16, 2024

కామారెడ్డి: విష జ్వరంతో 4వ తరగతి విద్యార్థి మృతి

image

సదాశివనగర్ మండలం భూంపల్లిలో విషజ్వరంతో 4వ తరగతి చదువుతున్న ఊరడి రంజిత్(9) అనే బాలుడు మృతి చెందాడు. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న రంజిత్‌ను గురువారం మధ్యాహ్నం గాంధారి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. గ్రామంలో వారం రోజులుగా విష జ్వరాలతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

News August 16, 2024

NZB: రోడ్డు ప్రమాదాలపై సీపీ ఫోకస్.!

image

రోడ్డు ప్రమాదాలపై NZB CP కల్మేశ్వర్ ఫోకస్ పెట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా బండి నడపడం వంటి కారణాలను గుర్తించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 800 కేసులు, 400మందికి జైలు శిక్ష పడేలా చేశారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో 767యాక్సిడెంట్లు జరగగా, 337మంది ప్రాణాలు కోల్పోయారు. 250మంది ఆస్పత్రిలో చేరగా ఇప్పటికీ కోలుకోలేదు.

News August 16, 2024

KMR: ఉత్తమ సేవలకు సేవాపతకాలు, ప్రశంసా పత్రాలు

image

15AUG వేళ KMR జిల్లాలో పోలీసుశాఖలో సేవాపతకాలు, ప్రశంసాపత్రాలు TTDS ఛైర్మన్ రమేశ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నది వీరే..! కే.నరసింహ రెడ్డి, అఫ్సర్, జార్జ్, శ్రీనివాసులు, సంతోష్ కుమార్, శ్రీనివాస్, ఉస్మాన్, రాజు, కొనారెడ్డి, సాయికుమార్, మహేష్, సుభాషిణి, నర్సింలు, శ్రీనివాస్, హన్మండ్లు, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మళ్లీ కార్జున్, జానకిరామ్, శ్రీనివాస్, మాజిద్, భూపాల్ రెడ్డి, అశోక్ అందుకున్నారు.

News August 15, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

* ఉమ్మడి జిల్లాల్లో అంబరాన్నంటిన పంద్రాగస్టు వేడుకలు.. రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు
* రోడ్డెక్కాలంటే నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి.. లేకుంటే భారీ జరిమానాలు
* KMR: కల్వర్టులో కుళ్లిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
* CM రేవంత్ చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న నీలం రెడ్డి
* బాన్సువాడ: పంద్రాగస్టు వేళ సబార్డినేట్ తో బూట్లు మోయించిన RDO
* KMR: స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు.. ఆ ఊరికి బస్సు లేదు

News August 15, 2024

కామారెడ్డి: ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న నీలం రెడ్డి

image

కామారెడ్డి ఏఆర్ ఎస్ఐ జె.నీలంరెడ్డి ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, పోలీసు సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News August 15, 2024

NZB: ట్రాఫిక్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకం

image

నిజామాబాద్ ట్రాఫిక్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకం లభించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

News August 15, 2024

బాన్సువాడ: సబార్డినేట్‌తో బూట్లు మోయించిన అధికారి

image

78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ అధికారి తన సబార్డినేట్‌తో బూట్ల మోయించిన ఘటన గురువారం బాన్సువాడలో జరిగింది. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓ రమేశ్ రాథోడ్ బూట్లు వేసుకొని జెండా గద్దె వద్దకు వెళ్లాడు. ఆ తరువాత పొరపాటు తెలుసుకొని బూట్లు విడిచి అటెండర్‌తో పంపించారు. జెండా సాక్షిగా‌పై అధికారి బూట్లను అటెండర్ మోయించడంతో చర్చనీయాంశంగా మారింది.

News August 15, 2024

NZB: నేటి నుంచి హెల్మెట్ లేకపోతే బారి జరిమానాలు

image

ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నేటి నుండి ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ ధరించి నడపడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు సీపీ కాలేశ్వర్ రావు ఆదేశాలు జారీ చేశారు. నేటి నుండి హెల్మెట్ ధరించకపోతే అధికారులు భారీ జరిమానాలు వేయనున్నారు.

error: Content is protected !!