Nizamabad

News August 15, 2024

కామారెడ్డి: స్వాతంత్ర్యం వచ్చి 78ఏళ్లు.. ఆ ఊరికి బస్సు లేదు

image

స్వాతంత్ర్యం వచ్చి 78ఏళ్లు అవుతున్నా ప్రజలకు సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. పెద్దకొడపగల్ మండలం కాటేపల్లి తండాకి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. ఏళ్లు గడుస్తున్నా, ఎంత మందికి విన్నవించుకున్నా తమ గోడు వినట్లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ డీఎం స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలంటున్నారు. 

News August 15, 2024

నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా బంద్ ప్రశాంతం

image

బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం బంద్ విజయవంతమైంది. నిజామాబాద్‌లో బైక్‌ర్యాలీని గాంధీచౌక్ నుంచి బస్టాండ్, ఎల్లమ్మగుట్ట చౌరస్తా, హైదరాబాద్ రోడ్డు మీదుగా కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి శివాజీ చౌక్ నుంచి కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

News August 14, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* పిట్లం: జేబులో పేలిన మొబైల్ ఫోన్ * KMR: వడ్డీ వ్యాపారి వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యాయత్నం * బాన్సువాడ: రేషన్ డీలర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు * నిజామాబాద్ తో పాటు పలు మండలాల్లో బంద్ సక్సెస్ * ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రేపటి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం *KMR జిల్లాల్లోని కౌలాస్ ఖిల్లాపై రెండోసారి రెపరెపలాడనున్న జాతీయ జెండా * నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూడాల సమ్మె

News August 14, 2024

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐల బదిలీ

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 8 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు బోధన్ రూరల్ సీఐగా బదిలీ కాగా ఆయన స్థానంలోకి వెయిటింగ్‌లో ఉన్న బి.రఘుపతిని బదిలీ చేశారు. నిజామాబాద్ టౌన్ సీఐ నరహరిని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వెంకట్ నారాయణను బోధన్ SHOగా బదిలీ చేశారు.

News August 14, 2024

కామారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కౌలాస్ ఖిల్లా సిద్ధం

image

కామారెడ్డి జిల్లాలోని శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ ఖిల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఈ కోటకు పునర్వైభవం తీసుకురావాలనే సంకల్పంతో చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా గణతంత్ర దినోత్సవం నాడు తొలిసారిగా కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక రేపు గురువారం పంద్రాగస్టు వేడుకలు కోటలో ఘనంగా జరగనున్నాయి. మరోసారి కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది.

News August 14, 2024

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎంపి అరవింద్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌ను బుధవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల ఘటనలను, పలు పెండింగ్ సమస్యలపై కలెక్టర్‌తో చర్చించారు. అదేవిధంగా జర్నలిస్టుల ధర్నాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు మంజూరయ్యేలా చొరవ చూపాలని కోరారు.

News August 14, 2024

పిట్లం: జేబులో పేలిన సెల్ ఫోన్

image

ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ ఒకసారిగా పేలింది. ఈ ఘటన పిట్లంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఎనిగే సాయిలు అనే వ్యక్తి తన మొబైల్‌ని ఎప్పటిలాగే ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొబైల్ పేలింది. జేబులోంచి మొబైల్ తీసేలోపే మంటలు అంటుకొని జేబు కాలిపోయింది. ఈ ఘటనలో అతనికి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.

News August 14, 2024

నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ నగరంలో బంద్‌‌ కొనసాగుతోంది. వివిధ హిందూ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు నగరంలో ఉన్న వివిధ మర్చంట్ సంఘాల నాయకులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News August 14, 2024

బీర్కూర్: ఆర్టీసీ బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగలు

image

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంటలు చెలరేగటంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 14, 2024

నిజామాబాద్‌లో ఈరవత్రి అనిల్.. కామారెడ్డిలో పటేల్ రమేశ్ రెడ్డి

image

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డి జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి జెండాను ఎగురవేయనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.

error: Content is protected !!