Nizamabad

News May 16, 2024

జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

జహీరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

News May 16, 2024

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: KMR కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాల, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు లేకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు.

News May 15, 2024

బాల్కొండలో 5.03శాతం పెరిగిన పోలింగ్

image

2019 ఎంపీ ఎలక్షన్‌తో పోల్చితే 2024లో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ 5.03 శాతం పెరిగింది. 2019లో 69.72 శాతం నమోదవగా 2024లో 74.75 శాతం ఓటింగ్ పోలైంది. కాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల వారీగా పెరిగిన పోలింగ్ పరిశీలిస్తే.. బాల్కొండ ముందుండగా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానం 1.21 శాతంతో చివరిలో ఉంది. ఈ మేరకు గెలుపుపై అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు.

News May 15, 2024

NZB: గ్రూప్ -1, UPSC ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో, UPSC ప్రిలిమ్స్ ఆఫ్‌లైన్ గ్రాండ్ టెస్ట్‌ను హైదరాబాద్ బీసీ స్టడీ సర్కిల్‌లో నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వెంకన్న తెలిపారు. అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 15, 2024

NZB: మహిళా ఉద్యోగిని తిట్టిన ఎమ్మల్యే.. ఉద్యోగానికి రాజీనామా

image

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్ర వద్ద విధులు నిర్వహిస్తున్న తనను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తిట్టి కేంద్రం నుంచి బయటకి పంపించేశారిని మహిళ మెప్మా ఆర్పీ ఉద్యోగి ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ తనకు అక్కడ డ్యూటీ వేశారని చెబుతున్న వినకుండా ఎమ్మెల్యే తనను అవమానించాడని పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చేంది తన ఉద్యోగానికి రాజీనామా చేసి లెటర్‌ను మున్సిపల్ కమిషనర్‌కి అందజేశారు.

News May 15, 2024

నిజామాబాద్: గుండెపోటుతో వ్యవసాయ అధికారి మృతి

image

నిజామాబాద్ జిల్లా ధర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ (40) బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన మృతి పట్ల అధికారులు, రైతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీపీ సారిక, ఎంపీడీవో బాలకృష్ణ, ఎమ్మార్వో మాలతి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

News May 15, 2024

కామారెడ్డి జిల్లాలో ఈ గ్రామాలు ఆదర్శం

image

లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. ఎన్నికల కమిషన్‌ ఎన్ని స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించినా కొన్ని గ్రామాల్లో సరాసరిగా 75 శాతం కంటే అధికంగా పోలింగ్‌ నమోదు కాలేదు. కాని కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది పోలింగ్‌ కేంద్రాల ఓటర్లు 90 శాతానికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవి కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాల పరిధిలోనివి కావడం విశేషం.

News May 15, 2024

కామారెడ్డి: కొబ్బరి చెట్టు పై పిడుగు

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అప్రమత్తమైన సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పట్టణంలోని మహేశ్వరి థియేటర్ ప్రాంగణంలో గల కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దంతో పిడుగు పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అకాల వర్షానికి రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

News May 15, 2024

REWIND-2019: నిజామాబాద్‌లో BJPకి 70,875 ఓట్ల మెజార్టీ!

image

నిజామాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కల్వకుంట్ల కవిత (BRS)పై D. అర్వింద్(BJP)70,875 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. మధు యాష్కీ గౌడ్ (కాంగ్రెస్) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో జీవన్ రెడ్డి(కాంగ్రెస్), D. అర్వింద్(BJP), బాజిరెడ్డి గోవర్ధన్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 15, 2024

5 నెలల్లో BRS భూస్థాపితం అవనుంది: షబ్బీర్ అలీ

image

BRS పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం HYD నాంపల్లిలోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మరో 5 నెలల్లో BRS భూస్థాపితం అవనుందని, ఇక ఆ పార్టీ పని ఖతమైందన్నారు. BRS పార్టీ BJPకి బీ టీమ్‌గా పని చేస్తోందని ఆరోపించారు. కూతురు కవితను జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు KCR BJPతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.