India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా ఇన్ ఫ్లో పెరిగింది. గడిచిన 24 గంటల్లో యావరేజ్‌గా 6,375 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరిందని, మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 4,083 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80TMC)కు గాను ప్రస్తుతం 1080.90 అడుగుల (47.548TMC) నీరు నిల్వ ఉందని తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని కోటగిరి ఎస్సీ వసతి గృహంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వసతి గృహంలో తప్పుడు బిల్లులతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వసతి గృహంలో ఉన్న బియ్యం, ఇతర నిత్యవసర వస్తువులను పరిశీలించారు. రికార్డులు, బిల్లుల పరిశీలన కొనసాగుతోంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చందూర్ మండల కేంద్రంలో బుధవారం స్వచ్ఛందంగా బందును ప్రకటించుకున్నారు. హిందువులపై దాడులు ఆగే వరకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేపడతామని గ్రామస్థులు పిలుపునిచ్చారు. సాయంత్రం కొవ్వత్తులతో యువత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డల పైన హిందూ దేవాలయాలపై జరుగుతున్న మారణకాండకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు శివాజీ నగర్ ఆర్ ఆర్ చౌచౌరస్తా నుంచి గాంధీ చౌక్ కొరకు ర్యాలీ ఉంటుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల బాలికల(ఎస్సీ) సంక్షేమ హాస్టల్‌లో మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు ఆకస్మికంగా చేశారు. ఎస్సీ వసతి గృహంలో తప్పుడు బిల్లులతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం వసతి గృహంలో ఏసీబీ అధికారులు వివిధ శాఖలతో జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఫుడ్ సేఫ్టీ అధికారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, తూనికల కొలతల అధికారులు ఉన్నారు.,
ఉద్యోగం పేరిట ఓ యువకుడు సైబర్ వలలో చిక్కి రూ.1,30,200 పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో జరిగింది. తాడ్‌కోల్‌కు చెందిన విష్ణు అనే యువకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డాటా ఎంట్రీ ఉద్యోగం వచ్చిందని వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అనంతరం నష్టం జరిగిందని సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో రూ.1,30,200 పంపి మోసపోయాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ కృష్ణ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అభంశుభం తెలియని చిన్నారుల జీవితాలు అత్యాచార ఘటనల్లో ముగిసిపోతున్నాయి. బోధన్ నియోజకవర్గంలో 8 నెలల్లో మైనర్లపై పలు అత్యాచార ఘటనలు వెలుగు చూశాయి. కాగా, పెద్దమనుషుల పంచాయతీలతో ఎన్నో కేసులు కనుమరుగు అవుతున్నాయి. పోలీసు స్టేషన్‌లో 8 నెలల్లో 7 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి.
పోచారం ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను అక్కడ ఉన్న యువకులు ధైర్యం చేసి కాపాడారు. మెదక్ పట్టణానికి చెందిన నాగరాణి (33) కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రాజెక్టులోకి దూకిందని ఎస్ఐ మల్లారెడ్డి తెలిపారు. గమనించిన మాల్ తుమ్మెద గ్రామ యువకులు నరేశ్, అఖిల్ ఆమెను రక్షించినట్లు చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని నిర్దేశించారు.
ఓ కానిస్టేబుల్ బిడ్డ ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నిజామాబాద్‌కు చెందిన రాథోడ్ మోజీరాం కుమార్తె కావేరి HYDలో ప్రిపేర్ అవుతూ.. AEE R&B, AE, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూపు-4, SSC JE ఉద్యోగాలు సాధించి సత్తాచాటారు. ISROలో ఇంటర్వ్యూకు సైతం సెలెక్ట్ అయ్యారు. IAS కావటమే తన లక్ష్యమని తెలిపారు. కావేరిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Sorry, no posts matched your criteria.