Nizamabad

News May 14, 2024

నిజామాబాద్: మునుపెన్నడూ లేనివిధంగా ఓటింగ్ నమోదు

image

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.

News May 13, 2024

NZB: ఓటువేయడానికి వచ్చి వృద్ధురాలి మృతి

image

ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ పోతంగల్‌కు చెందిన గిరిగమ అనే వృద్ధురాలు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. గేటు దాటి లోపలికి వెళుతూ నీరసంగా ఉందని కొద్ది సేపు కూర్చోని అక్కడే స్పృహకోల్పోయింది. దవాఖానాకు తీసుకెళ్లగా ఆరోగ్య సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.

News May 13, 2024

నిజామాబాద్: GREAT.. చేతులు లేకపోయినా ఓటేశాడు

image

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దపల్లిలో దివ్యాంగుడైన అజ్మీరా రవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అతడికి రెండు చేతులూ లేకపోవటంతో ఎన్నికల సిబ్బంది వేలికి సిరా చుక్క వేశారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ఓటు వేయడానికి ముందుకు వచ్చిన రవిని పలువురు అభినందిస్తున్నారు.

News May 13, 2024

నిజామాబాద్: సాయంత్రం 5 వరకు 67.96% పోలింగ్

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇప్పటివరకు 67.96% పోలింగ్ నమోదయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం ఈ విధంగా ఉంది. ఆర్మూర్‌లో 69.61, బోధన్ – 70.84, నిజామాబాద్ అర్బన్ – 57.86, నిజామాబాద్ రూరల్- 70.54, బాల్కొండ – 71.31, కోరుట్ల – 70.07, జగిత్యాల – 68.55 శాతంతో NZB నియోజకవర్గంలో 67.96 పోలింగ్ శాతం నమోదయింది.

News May 13, 2024

NZB: మరో గంట మాత్రమే ఉంది.. వేకప్

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా కొన్నిపోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మరో గంటలో పోలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు త్వరగా ఓటేసేందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఓటు వేయనట్లయితే త్వరగా వెళ్లండి.
– SHARE IT

News May 13, 2024

NZB పార్లమెంట్‌లో 11 గంటలకు 28.26% పోలింగ్

image

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 28.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్ రూరల్ 28.77, నిజామాబాద్ అర్బన్ 23.04, ఆర్మూర్ 28.39, బోధన్ 29.46, బాల్కొండ 30.53, కోరుట్ల 29.10, జగిత్యాల 30.10 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News May 13, 2024

లింగంపేట్: చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు మృతి

image

చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో చోటుచేసుకుంది. లింగంపేట మండల కేంద్రంలో మత్తడి పోచమ్మ ఆలయానికి వెళ్లేదారిలో ఎల్లమ్మ గుడి వద్ద గల వేప చెట్టుకు ఉరి వేసుకొని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియ రాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 13, 2024

జహీరాబాద్ పార్లమెంట్ లో 12.88 శాతం పోలింగ్ నమోదు

image

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 9 గంటల వరకు 12.88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 15.71 శాతం, జుక్కల్ లో 12.58 శాతం, ఎల్లారెడ్డి లో 14.17 శాతం, కామారెడ్డిలో 12.49 శాతం, నారాయణ ఖేడ్ లో 12.71 శాతం, ఆందోల్ లో 11.48 శాతం, జహీరాబాద్ నియోజవర్గంలో 11.84 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News May 13, 2024

ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు

image

ఓటింగ్ సరళిని కంట్రోల్ రూమ్ ద్వారా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐ.డీ.ఓ.సీ)లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరిశీలిస్తున్నారు.

News May 13, 2024

సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ధర్మపురి అర్వింద్

image

భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్‌లో గల కాకతీయ స్కూల్ క్యాంపస్ పోలింగ్ బూత్‌లో ఆయన సతీమణి తో కలిసి ఓటు వేశారు. ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.