India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నగరంలోని 4వ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆదివారం సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి 8 సెల్ ఫోన్లు, రూ.10,140 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
పారిస్ నుంచి తిరిగి వచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ తన తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్‌తో కలిసి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గ్రూప్-1 పోస్ట్‌తో పాటు తనకు కేటాయించిన 600 చదరపు గజాల స్థలం పట్ల ముఖ్యమంత్రికి, షబ్బీర్ అలీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు.
నిజామాబాద్‌లో అదృశ్యమైన వ్యక్తి మృతదేహం బాసరలో లభ్యమైనట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. వినాయక్ నగర్‌కు చెందిన కల్లెపల్లి రాజు(36) ఈ నెల 3న కుటుంబ కలహాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో రాజు ఆచూకీ కోసం గాలించగా ఆదివారం బాసరలోని గోదావరి నదిలో శవమై కనిపించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
రైలులో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక సంచులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా నిజామాబాద్ RPF, GRP ప్రత్యేక బృందాలు 17057 నంబర్ ట్రైన్‌లో తనిఖీ చేయగా 3 నల్లబెల్లం సంచులు, 7 పటిక సంచులను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిజామాబాద్ RPF పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాటి విలువ రూ.19,600 ఉంటుందని CI సుబ్బారెడ్డి తెలిపారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేష్ కథనం ప్రకారం.. మామిడి చిరంజీవులు తన భార్యతో కలిసి వరి పొలానికి మందు చల్లుతున్నారు. దాహం వేయడంతో బోరు మోటర్ వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్స్ పాడైంది. మరమ్మత్తుల నిమిత్తం నియంత్రిక హ్యాండిల్‌ను పట్టుకోగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. పంచాయతీల వారీగా.. సెప్టెంబర్, అక్టోబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ గత 6 నెలలుగా సర్పంచ్‌లు లేక అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి.
సిరిపూర్‌కి చెందిన తెండుసాగర్ ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగ లేక వాటర్ ప్లాంట్‌లో కూలీలుగా సాగర్ తన భార్య చందన పనిచేస్తున్నారు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఇద్దరు గొడవ పడేవారు. ఈ మధ్య వారికి గొడవ జరగడంతో చందన డ్యూటీకి నడుచుకుంటూ న్యాల్కల్ కెనాల్ వరకు వెళ్లగా,. భర్త బైక్‌పై కెనాల్ వరకు వచ్చి తన భార్య కళ్ళ ముందే కెనాల్‌లో దూకాడు. కెనాల్‌లో వెతకగా శవమై దొరికాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
సైబర్ మోసగాళ్ల చేతుల్లో మాచారెడ్డి మండలంలోని కాకుల గుట్ట తండాకు చెందిన ఓ నర్సింగ్ ఆఫీసర్ భూక్య సంతోష్ మోసపోయాడు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించి, లింక్ పంపి దాని ద్వారా వివరాలు తీసుకొని అతని అకౌంట్లోని రూ.67,700 డబ్బును దోచేశారు. వెంటనే సంతోష్ షాక్‌కు గురై, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి పోలీసులను కోరారు.
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ అన్నారు. శనివారం నిజామాబాద్ రూరల్ పరిధిలోని తిర్మన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని ఆర్సపల్లిలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని నిజాం కాలానికి చెందిన అన్వర్(42) ఆర్సపల్లి బైపాస్ నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్ళే మార్గ మధ్యంలో ఆగివున్న లారీని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.