Nizamabad

News May 9, 2024

KMR: తొలి MLA, MPలు.. తాతామనవళ్లు

image

నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి, ZHB లోక్ సభ స్థానానికి తొలి MLA, MPలుగా ఎన్నికైంది షెట్కార్‌లే కావడం గమనార్హం. 1952లో ప్రస్తుత NKD అసెంబ్లీ సెగ్మెంట్ కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉండేది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పారావు షెట్కార్ MLA అయ్యారు. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ MPగా గెలిచారు. కాగా వీరిద్దరూ తాతామనవళ్లు కావడం గమనార్హం.

News May 9, 2024

NZB: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్‌ పట్టణం నాగారంలోని 300 క్వార్టర్స్‌కు చెందిన చెన్నూరు కావేరి(30) అనే వివాహిత బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్ ఆటోడ్రైవర్ కాగా తాగి డబ్బులు వృథా చేస్తున్నాడని వారిద్దరి మధ్య గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే కావేరిని తన భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 9, 2024

ZHB: MP ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి జహీరాబాద్ సవాల్‌గా మారిందని టాక్.

News May 9, 2024

NZB: ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. NZB, ZHB లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

బిక్కనూర్: రైలు ఢీకొని యువకుడి మృతి

image

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని రైలు ఢీకొట్టిన ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌కి చెందిన మాలోత్ ప్రకాశ్‌గా గుర్తించారు. తన సొంత పనులపై బైక్‌పై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ప్రకాశ్ బంధువుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 9, 2024

కామారెడ్డి: పోల్‌మేనేజ్‌మెంటుకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 3 ప్రధాన పార్టీలు ముఖ్యనేతలను రప్పించి రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డిల బహిరంగ సభను ఈనెల 11న కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

News May 9, 2024

పారిస్ ఒలింపిక్స్‌కు నిజామాబాదీ

image

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. నిఖత్‌తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.

News May 9, 2024

NZB: ఒకే రోజు 2 మీటింగ్లు.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్

image

NZB జిల్లాలో CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. NZB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన బుధవారం ఆర్మూర్, NZBలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ తన ప్రసంగాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు.

News May 9, 2024

హామీలు ఇచ్చి మోసం చేసిన కవిత, అర్వింద్: రేవంత్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, అర్వింద్ ధర్మపురి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారిని విమర్శించారు. ఇక ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.

News May 8, 2024

కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది: CM

image

కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మోదీ మనసునిండా రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనే ఉందన్నారు. బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్నారు.