India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లా జిల్లా వాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీగా ఓపీ పెరిగింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,62,122 ఇళ్లల్లో 6,21,890 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 3,885 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. వానాకాలం నుంచి 38 రోజుల్లో 89 డెంగ్యూ కేసులు వచ్చాయి.
నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ కట్టను నేషనల్ హైవే అధికారులు నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే తొలగించారని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నేషనల్ హైవే అలైన్‌మెంట్ లేని భూమి వద్ద ఉన్న 100 ఏళ్ల చెట్టును సైతం నరికి వేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఆయన నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు కట్టను తొలగించడం ద్వారా నీటి నిల్వకు తీవ్ర నష్టం అన్నారు.
మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వి.వెంకట నారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మంది పట్టుబడగా వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 34 మందికి రూ.89 వేలు జరిమానా విధించారన్నారు. ముగ్గురికి జైలు శిక్ష విధించారని చెప్పారు.
విద్యాసంస్థలలో ఇతర ప్రాంతాల్లో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, విద్యాలయాలు ప్రారంభమైన నేపథ్యంలో ఫ్రెషర్స్ పార్టీ అని కొత్తగా వచ్చిన విద్యార్థులను, సీనియర్ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బెదిరించడం, భయబ్రాంతులకు గురిచేయడం లాంటివి గతములో జరిగేవని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, బిర్కూర్ మండలంలోని బొమ్మనిదేవ్ పల్లి గ్రామానికి చెందిన జింక శ్రీకాంత్(36) భార్య పిల్లలు. పెయింటింగ్ పనులు చేసుకుంటారు. గత మూడు సంవత్సరాల నుంచి నిజామాబాద్ నగరంలోని జెండాగల్లిలో నివసిస్తున్నారని తెలిపారు.
కరెంట్ షాక్‌తో ఒక యువరైతు మృతి చెందాడు. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన స్వామి రెడ్డి తన వ్యవసాయ బావి వద్ద స్టార్టర్ డబ్బాలో విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా విద్యుత్ షాక్ కలిగి అక్కడికక్కడే మృతి చెందారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ సాయికుమార్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.
కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి, 270క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. నెల రోజుల క్రితం ఈ రైస్ మిల్లుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాద దంపతులపై జనగాం పోలీసులు అకారణంగా దాడి చేసి హింసించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు.
బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్, మద్నూర్, మహ్మద్ నగర్, పెద్దకొడపల్, జుక్కల్, నిజాంసాగర్, డోంగ్లీ మండలాల్లో ఉన్న 28 రేషన్ దుకాణాలకు డీలర్లను భర్తీ కోసం 311 దరఖాస్తులు వచ్చాయని బాన్సువాడ ఆర్డీవో రాథోడ్ రమేశ్ తెలిపారు. ఈనెల 9న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్ఆర్ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు దారులు గమనించాలని కోరారు.
బాలికను అపహరించిన కేసులో బోధన్‌కు చెందిన 3వ వార్డు <<13791540>>కౌన్సిలర్ <<>>రాధాకృష్ణపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అతడిపై మంగళవారం పోలీసులు బాలిక అపహరణ, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. కాగా గతేడాది అతడి సోదరుడు రవికుమార్ పై బోధన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేయగా.. తాజాగా బాధితురాలి కుటుంబీకులను బెదిరించడంతో మళ్లీ అతడిపై పోక్సో కేసు నమోదైంది. వారిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.