Nizamabad

News May 7, 2024

బీర్కూర్: బావిలో దూకి ఆత్మహత్య 

image

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రానికి చెందిన మహేశ్ (30) అనే వ్యక్తి బీర్కూర్ శివారులోని బండగల్లీలో గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మహేష్ నిత్యం భార్యతో గొడవ పడేవాడని, ఈనెల 2న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు. పాడుబడ్డ బావిలో మహేష్ మృతదేహాన్ని గుర్తించామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News May 7, 2024

NZB: ప్రియుడితో కలిసి భర్త మర్మాంగంపై దాడి చేసి హత్య

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన కోటగిరి మండలం ఎత్తొండలో చోటుచేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగయ్య (50)భార్య లక్ష్మికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న నాగయ్య ముక్కు, మర్మాంగాలపై దాడి చేసి హతమార్చింది.

News May 7, 2024

కామారెడ్డికి రేవంత్, KCR, ప్రియాంక

image

కామారెడ్డి జిల్లాలో అగ్రనేతల ప్రచారం కొనసాగనుంది. నేడు కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కేసీఆర్.. బస్సు యాత్రతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 10న కామారెడ్డిలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు.

News May 7, 2024

NZB: NDAకు 250 కి మించి సీట్లు రావు: KCR

image

NDA కూట‌మికి 250కి మించి సీట్లు రావని BRS అధినేత KCR జోస్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు చౌర‌స్తాలో సోమవారం రాత్రి నిర్వ‌హించిన రోడ్ షోలో KCR పాల్గొని ప్ర‌సంగిస్తూ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ గవ‌ర్న‌మెంట్ రాదన్నారు. ప్రాంతీయ శ‌క్తులే ఏర్పాటు చేసే ప్రభుత్వం వస్తుందని, BRS 14 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్ర రాజ‌కీయాల్లో తెలంగాణ కీల‌కంగా మారుతుందన్నారు.

News May 7, 2024

నిజామాబాద్ జిల్లా నా గుండెల్లో ఉంటుంది: KCR

image

తాను చచ్చేంత వరకు నిజామాబాద్ జిల్లా తన గుండెల్లో ఉంటుందని KCR అన్నారు. సోమవారం రాత్రి నగరంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. తాను గులాబీ జెండా ఎత్తినప్పటినుంచి తన వెంట నిజామాబాద్ జిల్లా ప్రజలు నడిచారన్నారు. మొదటిసారిగా బీఆర్ఎస్ తరఫున జిల్లా పరిషత్‌ను గెలిపించిన ఘనత కూడా జిల్లాకే దక్కుతుందన్నారు.

News May 6, 2024

కామారెడ్డి: ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ద్వితియ శ్రేణి మెజిస్ట్రేట్ ప్రతాప్ తీర్పునిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహమ్మద్ యూనిస్, కోన గణేశ్ పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచనట్లు పోలీసులు తెలిపారు. వారికి న్యాయస్థానం 2రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 చొప్పున జరిమానా విధించింది.

News May 6, 2024

ఈ నెల 8న నిజామాబాద్‌కు CM రేవంత్ రెడ్డి 

image

పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలిపించేందుకు కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే, మంత్రి ప్రచారాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాటు చేసిన జన జాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

News May 6, 2024

నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య

image

నిజామాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన నాగయ్య(45)ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి గ్రామ శివారులోకి తీసుకెళ్లి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని తీసుకువచ్చి ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 6, 2024

కామారెడ్డి: నీటి సంపులో పడి బాలుడి మృతి

image

కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న మూడు సంవత్సరాల అన్విత్ అనే బాలుడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. దీన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 6, 2024

మండుతున్న భానుడు.. నిజామాబాద్ @46.2℃

image

ఆదివారం జిల్లాలోనే అత్యధికంగా నిజామాబాద్ ఉత్తరంలో మండల కేంద్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైంది. ఇందూరు నగరం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. భానుడి ప్రతాపంతో ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. బయటికెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.