India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంట్లో లైటు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగి ఆవేశంలో తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన బాన్సువాడలోని దాల్‌మల్ గుట్టలో జరిగింది. వకీల్ కృష్ణ(40), వకీల్ రాజు అన్నదమ్ముళ్లు. సోమవారం రాత్రి లైటు విషయంలో గొడవతో రాజు అన్న కృష్ణపై కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. మెడపై పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆస్పత్రికి తరలించేలోపు కృష్ణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గల్ఫ్ దేశంలోని రియాద్ ప్రాంతంలో కామారెడ్డి మండలం షబ్దిపూర్ గ్రామానికి చెందిన మున్నా అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ ఏడాదిగా జీతం ఇవ్వకపోవడంతో తినడానికి తిండి లేక అల్లాడుతున్నాడు. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందిన స్వగ్రామానికి రాలేకపోయారు. తమను స్వగ్రామానికి పంపించాలని అక్కడ పలువురిని సెల్ఫ్ వీడియో ద్వారా వేడుకుంటున్నాడు.
బాన్సువాడ మండలం బుడ్మీ గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రత్కంటి సాయినాథ్ మంగళవారం కిడ్నాప్ అయ్యారు. మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ఆయన బాన్సువాడ టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం కొందరు ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడి బయటకు తీసుకొని వెళ్లారు. అనంతరం కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జీవితంపై విరక్తితో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాపునగర్ గ్రామానికి చెందిన రేపాక కుమార్ (38) అనే వ్యక్తి తాగుడికి బానిసై కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన వైనమిది. జిల్లాలోని ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గంగాధర్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేసి ఫోన్ చేశాడు. వెంటనే అతడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.96 వేలు కాజేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళ ప్రాణాలను నిజామాబాద్ 2 టౌన్ SI రాము కాపాడారు. హైమద్ పుర కాలనీకి చెందిన ఓ వివాహిత తన భర్తపై అనుమానంతో సోమవారం ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో అతడు పోలీసులను సంప్రదించారు. ఆమె ఫోన్ ట్రాక్ చేయగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లగా ఆమె రైలుకు ఎదురుగా వెళ్తూ కనిపించడంతో ఆమెను రక్షించారు.
రుణమాఫీ కాని రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఇద్దరు అధికారులను నియమించామన్నారు. రైతులు తమ పూర్తి వివరాలు 8374852619 నంబర్‌కు పంపించాలని ఆయన సూచించారు.
*ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన స్వచ్ఛదనం – పచ్చదనం *నిజామాబాద్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు *బోధన్‌లో అదృశ్యమైన విద్యార్థి.. తిరుపతిలో లభ్యం *జుక్కల్ MLAను అడ్డుకున్న యువత.. రోడ్లు బాగుచేయాలని డిమాండ్. *కోటగిరి: విద్యార్థులకు గొడ్డుకారంతో భోజనం.. స్పందించిన KTR *NZB: కలెక్టరేట్‌ను ముట్టడించిన PDSU నాయకులు *NZB: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన DEO* బాన్సువాడ: పంటలకు పురుగుల బెడద
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు పీజీ కోర్సుల 2వ, 8వ రెగ్యులర్ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య అరుణ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 12వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు చెల్లించవచ్చన్నారు.
పాఠశాల విద్యార్థులకు గొడ్డుకారం, నూనె పోసి అన్నం పెడుతున్నారన్న ఘటనపై KTR స్పందించారు. ఘటనకు సంబంధించిన ఫొటోతో గత BRS ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మెనూను జత చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మన బడి పిల్లలకు అందాల్సిన ఆహారం ఇదేనా..? పాఠశాలల్లో పెడుతున్న భోజనంపై వీలైనంత త్వరగా సమీక్షించాలని తెలంగాణ CSను ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.