India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు పొడిగించారు. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు పీజీ కోర్సుల 2వ, 8వ రెగ్యులర్ సెమిస్టర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య అరుణ తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 12వరకు, రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు చెల్లించవచ్చన్నారు.
పాఠశాల విద్యార్థులకు గొడ్డుకారం, నూనె పోసి అన్నం పెడుతున్నారన్న ఘటనపై KTR స్పందించారు. ఘటనకు సంబంధించిన ఫొటోతో గత BRS ప్రభుత్వంలో బడి పిల్లలకు అందించిన మెనూను జత చేసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మన బడి పిల్లలకు అందాల్సిన ఆహారం ఇదేనా..? పాఠశాలల్లో పెడుతున్న భోజనంపై వీలైనంత త్వరగా సమీక్షించాలని తెలంగాణ CSను ఆయన కోరారు.
నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం కొండాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల జీవశాస్త్రం బోధించే టీచర్ పద్మజను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో పద్మజ సిరికొండ మండలంలోని కొండూరుకు బదిలీ చేశారు. ఆ వెంటనే మోడిఫికేషన్ పేరుతో అదే మండలం కొండాపూర్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉపాధ్యాయులు మాత్రం కొండూరులో జాయిన్ కాలేదు.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వన మహోత్సవంలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ నియోజకవర్గం శాసనసభ్యులు లక్ష్మీకాంతంతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులు మందు నిల్వ గది పరిశీలించారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జుక్కల్ మండలంలో బస్వాపూర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఏ విధంగా చెబుతున్నారని అర తీసి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు. కష్టపడి చదువుకుని మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం గ్రామస్థులకు కనిపించింది. వ్యవసాయ బావుల వద్ద మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో పలు గ్రామాలకు సమాచారం అందించారు.
ఎల్లారెడ్డి గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 44 నంబర్ జాతీయ రహదారిపై యువకుడు(30) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఎస్సై రంజిత్ వివరాల ప్రకారం.. సదాశివనగర్ వైపు నుంచి కామారెడ్డి వైపు యువకుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు.
ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. వివరాలిలా.. ఆదివారం రాత్రి నిజామాబాద్ నగరంలోని 2-వ టౌన్ పరిధిలోని ITI కాలేజీ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటి కాంపౌండ్ వాల్ కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో ఇంట్లో వాళ్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి కుక్కలు రోడ్డుపై తిరుగుతుండటంతో ఒంటరిగా కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44పై కుక్కటు గుంపులు గుంపులుగా సంచారిస్తుడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను తప్పించాలని కోరుతున్నారు.
గాంధారి: రైతు బీమా దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగుస్తుందని మండల వ్యవసాయాధికారి నరేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 28వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసి ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులతో పాటు ఇప్పటివరకు బీమా కోసం దరఖాస్తు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.