Nizamabad

News August 5, 2024

కామారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టుల UPDATE

image

జిల్లాలోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1,389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.80 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం 416.400 మీటర్లుగా ఉంది.

News August 4, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

* కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. సిబ్బందిపై DEO ఫైర్ * రామారెడ్డి: రెడ్డి పేట్ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం * KMR: ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ మాత్రమే: జిల్లా కలెక్టర్ * పార్టీకి విధేయులుగా ఉన్నవారే నా రాజకీయ వారసులు: జుక్కల్ MLA * ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని శిక్షించాలి.. CP ను కోరిన షబ్బీర్ అలీ * నిజామాబాద్‌లో వివాహిత సూసైడ్.

News August 4, 2024

నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతా: షబ్బీర్ అలీ

image

నిజామాబాద్ పట్టణాన్ని రూ.300 కోట్ల అమృత్ నిధుల ద్వారా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ సలహదారు షబ్బీర్ అలీ అన్నారు. నీటి సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు పరిస్కరిస్తానని పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు.

News August 4, 2024

కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యా యుడిపై మండిపడి ఎంఈఓకు ఫిర్యాదు చేశారు.

News August 4, 2024

NZB: నీట్ పరీక్షలో ర్యాంక్ సాధించిన నిషితా రెడ్డి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన చాక్రోడ్ నిషితా రెడ్డి ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ఫలితాలలో 5,391వ స్టేట్ ర్యాంక్ సాధించిందని తండ్రి చాక్రోడ్ రవీందర్ రెడ్డి తెలిపారు. నిషితా రెడ్డి రాత్రి పగలు కష్టపడి చదివి అనుకున్న ర్యాంక్ సాధించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు కాలనీ వాసులు శుభాకాంక్షలు తెలిపారు.

News August 4, 2024

నిజామాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే నిజామాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ఉమ్మడి NZB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

NZB: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణమాసం మెుదలవుతోంది. ఈనెల 8, 9,10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

BREAKING: ఉదయాన్నే కామారెడ్డి డిపో బస్సుకు ప్రమాదం

image

తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి డిపోకి చెందిన బస్సు మరో బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సును రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవే-44పై వాహనాలు నిలిచాయి.

News August 4, 2024

NZB: డ్రైనేజీ నిర్మాణానికి తవ్వకం.. కూలిన అపార్ట్‌మెంట్ ప్రహరీ

image

డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి పొక్లైన్‌తో తవ్వుతుండగా అపార్ట్‌మెంట్ ప్రహరీ కూలిన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. ఫేజ్-2లోని ప్రధాన రహదారిపై లక్ష్మీ బాలాజీ నిలయం అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ కోసం తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అపార్ట్‌మెంట్ వారు ఆరోపించారు.

News August 4, 2024

ఆర్మూర్: దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చక్కటి నిదర్శనం: కలెక్టర్

image

ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎదుగుదల చక్కటి నిదర్శనమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తాను పుట్టిపెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మర్చిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

error: Content is protected !!