Nizamabad

News August 4, 2024

NZB: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణమాసం మెుదలవుతోంది. ఈనెల 8, 9,10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

BREAKING: ఉదయాన్నే కామారెడ్డి డిపో బస్సుకు ప్రమాదం

image

తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి డిపోకి చెందిన బస్సు మరో బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సును రిపేర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మెకానిక్‌లకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో హైవే-44పై వాహనాలు నిలిచాయి.

News August 4, 2024

NZB: డ్రైనేజీ నిర్మాణానికి తవ్వకం.. కూలిన అపార్ట్‌మెంట్ ప్రహరీ

image

డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి పొక్లైన్‌తో తవ్వుతుండగా అపార్ట్‌మెంట్ ప్రహరీ కూలిన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. ఫేజ్-2లోని ప్రధాన రహదారిపై లక్ష్మీ బాలాజీ నిలయం అపార్ట్‌మెంట్ వద్ద డ్రైనేజీ కోసం తవ్వుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని అపార్ట్‌మెంట్ వారు ఆరోపించారు.

News August 4, 2024

ఆర్మూర్: దానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చక్కటి నిదర్శనం: కలెక్టర్

image

ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చు అనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఎదుగుదల చక్కటి నిదర్శనమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ తాను పుట్టిపెరిగిన ప్రాంతం, చదువుకున్న బడిని మర్చిపోకుండా విద్యార్థులను ప్రోత్సహించేందుకు అవార్డులను అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

News August 3, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

*బాన్సువాడ: RTC బస్సులో ప్రమాదపు అంచున ప్రయాణం 
*KMR: రవీందర్ రెడ్డి సూసైడ్.. కుటుంబ సభ్యుల ఆందోళన 
*NZB: ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ వామపక్షాల నిరసన 
*KMR: గంజాయిని ఉక్కుపాదంతో అణచివెయ్యండి:SP 
*కామారెడ్డిలో యువతి కిడ్నాప్‌కు యత్నం 
*NZB:నగర శివారులో చిరుత సంచారం 
*NZB: నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు 
*SRSP అప్డేట్: 17,925 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

News August 3, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రవి పటేల్ (40) గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో గత కొద్ది రోజులుగా భూతగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News August 3, 2024

మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ని కలిసిన మందకృష్ణ మాదిగ

image

జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్‌ను‌ MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగని శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. బీబీ పాటిల్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారన్నారు.

News August 3, 2024

SRSPఅప్డేట్: 23,964క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. నిన్న (శుక్రవారం) రాత్రి 9 గంటలకు 52,164 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా రాగ శనివారం ఉదయం 10 గంటలకు అది తగ్గి 23,964 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఔట్ ఫ్లోగా 703 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMC లకు గాను ప్రస్తుతం 42.325 TMC ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News August 3, 2024

నిజామాబాద్: శ్రావణమాసంలో ఆర్టీసీ ఆఫర్

image

శ్రావణ మాసం సందర్భంగా ఆర్టీసీ రీజియన్ పరిధిలో స్పెషల్ ఆఫర్ అందించనున్నామని ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా పెళ్లిళ్లు ఇతర వేడుకలకు బస్సులను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ బస్సుల కంటే తక్కువ ఛార్జీ తీసుకుంటామని డ్రైవర్లకు కూలీ చెల్లించే అవసరంలేదన్నారు. అరుణాచలం వరకు బస్సు సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

News August 3, 2024

నిజామాబాద్: బ్యాంకు మేనేజర్ అరెస్ట్

image

UNION బ్యాంక్‌లో అవకతవకలకు పాల్పడిన మాజీ సీనియర్ మేనేజర్‌అరెస్టయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని బ్యాంకు బడాబజార్ సీనియర్ మేనేజర్ అజయ్‌ ఖాతాదారులను నమ్మించి రూ.3కోట్లు వసూలు చేశారు. వారి హామీపత్రాలను వాడుకొని డబ్బులు తీసుకున్నాడు. మోసపోయిన బాధితుల్లో ఒకరు జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అజయ్‌ను శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.

error: Content is protected !!