India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్ గ్రామ శివారులోని వాగులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురువారం కొట్టుకొచ్చినట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు రూరల్ పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు సుమారు (50) ఏళ్లు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా యావరేజ్ గా 5,166 క్యూసెక్కుల అది పెరుగుతూ రాత్రి 9 గంటలకు 40,786 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37.891 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.90 మీటర్లుగా ఉంది. సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం అంతే స్థాయిలో 416.550 మీటర్లుగా ఉంది. ఇక కౌలాస్ నాలా ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది.
* సత్తాచాటిన కామారెడ్డి జిల్లా వాసులు.. CM రేవంత్ సన్మానం
* కామారెడ్డి: పని ఇప్పిస్తానని.. కత్తితో దాడి
* నిజాంసాగర్ లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆశిష్.. ఒకరి సస్పెన్షన్.. మరొకరికి నోటీసు జారి
* ఓర్వలేక KCR అసెంబ్లీకి రావట్లేదు: జుక్కల్ MLA తోట
* NZB: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య
* నిజామాబాద్: పలు ఎస్ఐల బదిలీ
* జిల్లాలో పలు చోట్ల BRS శ్రేణుల ఆందోళన.. CM రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టుపై సెటైర్లు వేశారు. అసెంబ్లీ నుంచి కేటీఆర్ ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోని ఎంపీ అరవింద్ ఫేస్ బుక్, ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘అప్పుడు.. కన్ను మిన్ను కనపడలే.. ఇప్పుడు.. ఖాకీలు కూడా దేకట్లే’ అని కేటీఆర్ పై అర్వింద్ సెటైర్లు వేశారు.
TU పరిధిలో దోస్త్ ఆన్లైన్ 2024-25డిగ్రీ ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు ఈ నెల 2న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని దోస్త్ కో ఆర్డినేటర్ ఆచార్య కె.సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి సా.5గం. వరకు పరిశీలన ఉంటుందన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు రెండు సెట్ల జీరాక్స్ కాపీలతో అడ్మిన్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. వివరాలకు 984804793,8374406322.
నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో లబ్ధి కాని ప్రజల నుంచి దరఖాస్తుల, పరిశీలన, డిస్పోజల్‌ను పరిశీలించారు. ప్రజాపాలన కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వేగంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఎంపీడీవో గంగాధర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
కోల్‌కతాలో ఇటీవల జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్ విభాగంలో తక్కడ్‌పల్లి ప్రతిభ 5 గోల్డ్‌మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. బాన్సువాడకు చెందిన రుషాంక్ సబ్ జూనియర్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ విభాగంలో పిట్లంకు చెందిన విజయ్ రాఘవేంద్ర రావు 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.
డిచ్‌పల్లి మండలంలోని 7వ బెటాలియన్ సమీపంలో ఉన్న ఖిల్లా రామాలయం ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు కేరాఫ్‌గా మారింది. ఆగస్టు నెల పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఖిల్లాకు క్యూ కట్టాయి. 17వ శతాబ్దం నాటి ఖిల్లా దగ్గర షూట్ చేసుకోవడం సంతోషంగా ఉందని పలు జంటలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాయి.
కాలకృత్యాలు కోసం వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన NZBలో చోటు చేసుకుంది. డిచ్పల్లికి చెందిన మహమ్మద్ అతరుల్లా (38) తన భార్య జువేరియా ఉస్మా డెలివరీ నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చాడు. ఇవాళ తెల్లారుజామున అతరుల్లా కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంకి వెళ్లగా, ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Sorry, no posts matched your criteria.