Nizamabad

News August 1, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 మంది సబ్ రిజిస్ట్రార్ల నియామకం

image

రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లను నియమించారు. కాగా నిజామాబాద్ అర్బన్‌లో ఇద్దరు, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, బోధన్‌లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు.

News August 1, 2024

NZB: పని ఇప్పిస్తానని.. కత్తితో దాడి

image

హైదరాబాద్‌లో పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి కత్తితో గాయపరిచి ఉడాయించిన ఘటన జీడిమెట్ల PS పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు కామారెడ్డి జిల్లాకు చెందిన యాదికి, శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. జీడిమెట్లకు తీసుకొచ్చి ఓ వైన్‌షాపు వద్ద మద్యం తాగారు. బుధవారం మళ్లీ మద్యం తాగి యాది వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ గొడవకు దిగాడు. దీంతో ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేశాడు.

News August 1, 2024

KMR: అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. పంచలోహ విగ్రహం స్వాధీనం

image

కామారెడ్డిలో అంతర్ జిల్లా దొంగను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకుని పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దొంగను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన చిల్లా గంగాదాసుగా పేర్కొన్నారు. అతడు మాక్లూర్ మండలం మాదాపూర్‌కు చెందిన దర్పల్లి సాయిలు, నిర్మల్ జిల్లాకు చెందిన కోసడిగి మోహన్లతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు.

News August 1, 2024

NZB: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News August 1, 2024

పారిస్ ఒలింపిక్స్.. నేడు నిఖత్ మ్యాచ్

image

పారిస్ ఒలింపిక్స్ లో నేడు నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ మ్యాచ్ జరనుంది. మహిళల 50కేజీల ప్రిక్వార్టర్స్ మ్యాచులో నిఖత్.. వుయుతో తలపడనుంది. మధ్యాహ్నం 2.31కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మెుదటి మ్యాచులో నిఖత్.. జర్మనీ క్రీడాకారిణిని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ALL THE BEST

News August 1, 2024

NZB: సీఎం రేవంత్ రెడ్డి మహిళ లోకం విరోధి: మధుసూదన్

image

సీఎం రేవంత్ మహిళ లోక విరోధి అని
నిజామాబాద్ BRS లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు ఆరోపించారు. మహిళల సాధికారతను జీర్ణించుకోలేని సీఎం తన మహిళ వ్యతిరేకతను అసెంబ్లీ సాక్షిగా చాటుకున్నారన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన తీరు మహిళల పురోగతిని, రాజకీయ చైతన్యాన్ని అడ్డుకునే అహంభావం ఉందని ఆక్షేపించారు.

News July 31, 2024

నిజామాబాద్ జిల్లాలో నేటి HIGHLIGHTS

image

◆మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య
◆చూపరులను కట్టిపడేస్తున్న సిర్నాపల్లి జలపాతం
◆NZB: నిరుద్యోగుల కోసం ఆగస్టు 2న జాబ్ మేళా
◆మద్యం మత్తులో కాలువలో పడి యువకుడు మృతి
◆నిజామాబాద్ జిల్లాలో జోరందుకున్న వరినాట్లు
◆కామారెడ్డి: విషాదం..పోస్టుమ్యాన్ మృతి
◆పిట్లం: కారులో వచ్చి ఆవును ఎత్తుకెళ్లారు (సీసీ ఫుటేజీ)
◆నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలు

News July 31, 2024

NZB: చెరువులో దూకి మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్పల్లి మండలం రామడుగుకు చెందిన దుమాల కవిత (43) మతిస్థిమితంలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

News July 31, 2024

మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో రూ. వెయ్యి కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. సీఐ నరేశ్ ప్రకారం.. మోఘ గ్రామానికి చెందిన లక్ష్మణ్ గొండా ఈనెల 20న రుణమాఫీ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సాయిలు.. లక్ష్మణ్ వద్ద రూ. వెయ్యి లాక్కున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో సలాబత్ పూర్ బ్రిడ్జి వద్ద లక్ష్మణ్‌ను.. సాయిలు బండరాయితో మోది హత్య చేశాడు.

News July 31, 2024

NZB: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఆగస్టు 2న జాబ్ మేళా

image

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఆగస్టు 2న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే.లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ఇంటర్మీడియేట్, డీగ్రీ, బీటెక్ అర్హతలు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు శివాజీ నగర్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 2న ఉదయం 10.30 గం’ల నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని ఆయన సూచించారు.

error: Content is protected !!