India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్‌కు చెందిన సాయి కుమార్ (21) నగర శివారులోని బోర్గాం వద్ద ఉన్న కల్లు దుకాణంలో మద్యం సేవించి కాలువలో పడి మృతి చెందినట్లు 4వ టౌన్ పోలీసులు తెలిపారు. లేబర్ పనులు చేసే సాయి కుమార్ బోర్గాం వద్ద ఉన్న కల్లు దుకాణంలో మద్యం సేవించి మద్యం మత్తులో పక్కనే ఉన్న కాలువలో జారీ పడి మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యమైన విషయం తెల్సిందే. ఈ ఏడాది సాగు సమయానికి ఆశించిన రీతిలో వర్షాలు రాకపోవడంతో అన్నదాతలు వరినాట్లు వేయడానికి సంకోచించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు వరినాట్లకు సిద్ధమైయ్యారు. ఈ సమయంలో రుణమాఫీ అవ్వడంతో రైతులకి పెట్టుబడులకు కలిసి వచ్చినట్లైంది. ఇది ఇలా ఉండగా నాట్లు వేయడానికి రైతులకు కూలీలు దొరకకపోవడంతో బిహార్ వాసులను ఆశ్రయిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు పోలీసుల ఆఫీసర్ల పేరుతో ఫోన్ చేస్తే స్పందించవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం ప్రజలను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పోలీసు ఆఫీసర్ల పేరిట బెదిరింపులకు పాల్పడుతూ.. కొత్త విధానానికి తెరలేపారని అన్నారు. సైబర్ మోసాలపై స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
నిజాంసాగర్ పరిధి బంజేపల్లి పంచాయతీ పోస్ట్ ఆఫీస్‌లో పోస్టుమ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన అంజయ్య(48) మంగళవారం హఠాన్మరణం చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రోజు లాగానే కార్యాలయానికి వెళ్లారని, అక్కడ ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. అంజయ్య మృతితో వారి రోదనలు మిన్నంటాయి.
డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న క్రమంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2023లో 294 కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 44 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని పడ్గల్‌లో ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించి రూ.95 వేలు వసూలు చేశారు. మన అప్రమత్తతే రక్ష, తెలియని వారి మాటలతో మోసపోవద్దని పోలీసులు అంటున్నారు. వారి సూచనలు పాటిస్తే సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చంటున్నారు.
అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పాడి ప్రొక్యూర్ మెంట్ సరైన పద్ధతిలో జరగడం లేదని ఆక్షేపించారు. ధరణి వల్ల భూములు అటు ఇటుగా మారి ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆర్టీసీ నిజామాబాద్ 2వ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజియన్, డిపోల వారీగా డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానీ రెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు సరస్వతీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
◆NZBలో రూ. 9 కోట్ల స్కామ్.. మంత్రికి MLA లేఖ
◆కామారెడ్డిలో వ్యభిచారం ముఠా అరెస్ట్
◆నిజామాబాద్ జిల్లాలో BSNL 4G సేవలు
◆పొతంగల్‌లో దారుణ హత్య
◆రెండో విడత రుణమాఫీని స్వాగతిస్తున్నాం: కామారెడ్డి MLA
◆SRSP అప్డేట్: 12,785 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. మంగళవారం ఉదయం10 గంటలకు 22,885 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో రాగా మధ్యాహ్నం 3 గంటలకు 17,100 క్యూసెక్కులుగా తగ్గింది. రాత్రి 9 గంటలకు మరింతగా 12,785 క్యూసెక్కులకు తగ్గింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMC లకు గాను ప్రస్తుతం 35.777 TMC ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగన్వార్ కమిషనరేట్లో ఆర్టీసీ డ్రైవర్ల కేసులపై మంగళవారం పునర్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆర్టీసీ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్ల తప్పుంటే మాత్రమే వారిపై కేసులు పెట్టాలని, లేకపోతే వారిపై ఎట్టి పరిస్థితుల్లో కేసులు పెట్టరాదని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సీపీ సూచించారు.
Sorry, no posts matched your criteria.