India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రైతు రుణమాఫీపై అసెంబ్లీలో మాట్లాడారు. రెండో విడత రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. పాడి సేకరణ సరైన పద్దతిలో జరగడం లేదన్న కేవీఆర్..అందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ- 2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా 7288894557, 7288894554 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను గుర్తించి వాటిని బాధితులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. 20 ఏప్రిల్ 2023 నుంచి 14 జులై 2024 వరకు NZB కమిషనరేట్‌లో 6,690 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,941 గుర్తించి 1,888 ఫోన్‌లను బాధితులకు అందించారు. కామారెడ్డి జిల్లాలో 4,917 కేసులు నమోదు కాగా 2,756 సెల్ ఫోన్లు గుర్తించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల్లో BSNL సేవలు ప్రారంభిస్తామని టెలికాం GM వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఛార్జీలు పెరగడంతో ప్రజలు BSNL వైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 270 టవర్లను 4Gకి మార్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని టవర్లు పూర్తికాగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి.
కామారెడ్డిలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకురాలిని దేవునిపల్లి ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరిని పట్టుకున్నారు. ఐదుగురిని సఖి కేంద్రానికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మిగతా ముగ్గురిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.
రైతుల పేరిట రూ.9 కోట్ల ఋణాలు తీసుకున్న నిజాంసాగర్‌లోని గాయత్రి షుగర్స్ పై విచారణ చేపట్టాలని జుక్కల్ MLA తోట లక్ష్మి కాంత్ రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. సంస్థ సొంత వ్యాపారాల కోసం 1030 మంది అమాయక రైతులను మోసం చేసి రూ.9 కోట్ల ఋణం పొందింది. రైతుల హక్కులను పరిరక్షించేలా ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు చేయించాలని లేఖ ద్వారా మంత్రికి విన్నవించారు.
కామారెడ్డి జిల్లాలో రెండో విడత రుణమాఫీ 24,816 మంది రైతులకు వర్తించిందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం రైతుల ఖాతాలో రూ.211.72 కోట్లు జమకానున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తారన్నారు.
* నిజామాబాద్: డయల్ 100 పై నిర్లక్ష్యం.. ఎస్ఐ అశోక్ పై వేటు
* పెద్దకొడప్గల్: 2018 నుంచి కాటేపల్లి తండాకు సర్పంచ్ లేరు
* పిట్లం: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి
* నిజామాబాద్: 14.5 కిలోల వెండి ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
* నిజాంసాగర్: మంత్రి తుమ్మలకు జుక్కల్ ఎమ్మెల్యే లేఖ
* బిచ్కుందలో రోడ్ల కోసం మోకాళ్లపై కూర్చొని నిరసన
డయల్ 100 కాల్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిజామాబాద్ ఐదో టౌన్ ఎస్ఐ అశోక్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. టౌన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి 100 కాల్ రాగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీపీ గుర్తించారు. అనంతరం స్టేషన్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.