Nizamabad

News April 27, 2024

NZB: పది మంది నామినేషన్ల తిరస్కరణ

image

NZB ఎంపీ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్‌వజ్‌ సమక్షంలో పరిశీలించారు. అభ్యర్థులు, వారి తరఫు ప్రతినిధులు హాజరయ్యారు. 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్‌లు వేయగా.. పది మందివి తిరస్కరణకు గురయ్యాయని రిటర్నింగ్‌ అధికారి హన్మంతు తెలిపారు. అఫిడవిట్‌లు సమర్పించక, నామపత్రాలపై సంతకాలు చేయకపోవడం, ప్రతిపాదకుల వివరాలు పేర్కొనకపోవడంతో తిరస్కరించినట్లు తెలిపారు.

News April 27, 2024

UPDATE.. NZB: రెండు కుటుంబాల్లో విషాదం

image

కమ్మర్ పల్లి నుంచి బడాపహాడ్‌కు36 మందితో వెళ్తున్న డీసీఎం బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ చైతన్య వివరాల ప్రకారం.. రెంజర్ల నర్సయ్య కుటుంబం మెుక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి డీసీఎంలో బడాపహాడ్ బయలుదేరారు. డ్రైవర్ అతి వేగంతో వాహానాన్ని నడపడంతో కోత్తపేట వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో వసంత(30), శ్యాంసుందర్ (40) అక్కడికక్కడే మృతి చెందారు.

News April 27, 2024

UPDATE.. NZB: భర్తను హత్య చేసిన భార్య

image

మోపాల్ మండలంలో భర్తను భార్య గొంతు నులిమి చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. కులాస్‌పూర్‌‌కు చెందిన సాయిరెడ్డి(52), రాధలకు 30 ఏళ్ల క్రితం వివాహం జరగగా వీరికి ముగ్గరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిగారింటి వద్దే ఉంటున్నారు. సాయిరెడ్డి తన భార్యను కుమార్తెను వేధిస్తుండటంతో వారు విసిగిపోయారు. ఈ క్రమంలో సాయిరెడ్డి నిద్రపోగా.. భార్య గొంతు నులిమి చంపింది.

News April 27, 2024

NZB: ‘10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ’

image

NZB పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిర్యాల్ కర్ జయప్రకాశ్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎం.డీ.షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోశం, మీసాల శ్రీనివాస్ రావు, వి.మహాతేజ నామినేషన్లు చెల్లుబాటు కాలేదన్నారు.

News April 26, 2024

సోషల్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ కోఆర్డినేటర్లు

image

హైదరాబాద్ నగరంలో TPCC సోషల్ మీడియా ఛైర్మెన్ మన్నే సతీష్, TPCC సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ నిర్వహించిన సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా CM రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అసెంబ్లీ మీడియా, జిల్లా కోఆర్డినేటర్లు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు అరుణ్, దేవిదాస్, సాయన్న, శివ, సుమన్, రాజు పాల్గొన్నారు.

News April 26, 2024

NZB: ‘కుళ్లిన కూరగాయలతో భోజనం పెడుతున్నారు’

image

నిజామాబాద్‌లోని నాందేవ్ వాడలో ఉన్న ST ప్రభుత్వ హాస్టల్‌లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. నేడు జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో హాస్టల్ విద్యార్థులు మురిగిన కూరగాయలు రోడ్డు మీద పోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News April 26, 2024

కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రమాదంలో హిందూ మహిళలు: అరవింద్

image

కాంగ్రెస్‌కు ఓటేస్తే హిందూ మహిళలు ప్రమాదంలో పడడం ఖాయమని BJP ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నగరంలో శుక్రవారం నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లును తమ ప్రభుత్వం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. దేశంలో జరిగే ఏ ఎన్నికైనా మహిళా ఓటు బ్యాంకు కీలకమని, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేది మహిళలే అని అన్నారు.

News April 26, 2024

అబ్జర్వర్ సమక్షంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ

image

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శుక్రవారం పోలింగ్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వజ్ ఆర్ సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో కలెక్టరేట్లో నిర్వహించిన ఈ ప్రక్రియలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, NIC అధికారి రవికుమార్, RDO తదితరులు పాల్గొన్నారు.

News April 26, 2024

స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

image

NZB పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి 42 మంది అభ్యర్థులు 90 నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిర్యాల్ కర్ జయప్రకాశ్, పోతు అశోక్, మొహమ్మద్ జమీల్, ఎం.డీ.షాహెద్ ఖాన్, కొండూరు గంగాధర్, పానిగంటి రజితావాణి, చెంచుల అశోక్, బేగరి పోశం, మీసాల శ్రీనివాస్ రావు, వి.మహాతేజ నామినేషన్లు చెల్లుబాటు కాలేదన్నారు.

News April 26, 2024

NZB: తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయల్సిందే..!

image

పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించాలనే పాఠం నేర్పిస్తుంది. ఈనెల 13న ముగ్గురు ఈతకు వెళ్లి ఒడ్యాట్ పల్లిలో మృతి చెందారు. అలాగే 16న ఎడపల్లిలో ఓవిద్యార్థిని, 18న గోదావరిలో నవాజ్ మృతి చెందాడు. కావున పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాల్సిందే.