Nizamabad

News July 28, 2024

NZB: అనర్హులు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అనర్హులు మాత్రం దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. సర్వీస్ పింఛన్‌తో పాటు ఆసరా పింఛన్లను ఏళ్లుగా తీసుకుంటున్న 555 మందిని అధికారులు ఇటీవల గుర్తించారు. వీరికి పింఛన్లను నిలిపివేయించి, నోటీసులు జారి చేశారు. కొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. కాగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రూ. 3.63 కోట్లు నష్టపోయింది.

News July 28, 2024

ఎల్లారెడ్డి: ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

image

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉద్యోగి విఠల్‌ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ రాజు తెలిపారు. మద్యం తాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. సస్పెండైన వ్యక్తి అనుమతి లేకుండా ఎల్లారెడ్డి మండల కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.

News July 28, 2024

SRSP అప్డేట్: 24గంటల్లో 23,599 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గడిచిన 24 గంటల్లో సుమారు 23,599 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి 624 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,074.6 అడుగుల మేర ఉందని చెప్పారు.

News July 28, 2024

కామారెడ్డి: కొడుకు చనిపోయాడని తండ్రి సూసైడ్

image

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(46) తన కొడుకు ఇటీవల మృతి చెందడంతో మానసిక వేదనకు గురై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భార్య మాధవి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కొడుకు విశాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News July 28, 2024

SRSP అప్డేట్: 26,510క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో శనివారం రాత్రి 10 గంటలకు 26,510 క్యూసెక్కులకు తగ్గింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగ సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1074.30 అడుగుల నీరు నిల్వ ఉంది.

News July 27, 2024

నిజామాబాద్: ఇద్దరు ACP లకు ASPలుగా పదోన్నతి

image

నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు ACP లకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 మంది డీఎస్పీలకు నాన్ కేడర్ ఏఎస్పీలుగా ప్రమోషన్ కల్పిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేయగా ఆర్మూర్ ACP బస్వా రెడ్డి, CCS ACP బి.కిషన్ అడిషనల్ SPలుగా ప్రమోషన్ పొందారు. వీరు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

News July 27, 2024

SRSP అప్డేట్: 30 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 35,078 క్యూసెక్కుల నీరు రాగా సాయంత్రం 6 గంటలకు అది 30,554 క్యూసెక్కులకు తగినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1074.20 అడుగుల నీరు నిల్వ ఉందని వివరించారు.

News July 27, 2024

సమస్యలను పరిష్కరించడం వల్ల మంచి వాతావరణం: కలెక్టర్

image

రాజీమార్గం ద్వారా సమస్యలను పరిష్కరించడం వల్ల సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యం లో కమ్యూనిటీ వాలంటీర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందుకోసం వాలంటరీలు కృషి చేయాలని సూచించారు.

News July 27, 2024

విద్యార్థులను స్కూల్, కాలేజీకి బైక్ పై రానివ్వొద్దు: ACP

image

నిజామాబాద్ ట్రాఫిక్ PSలో కళాశాల, పాఠశాల యాజమాన్యాలతో ట్రాఫిక్ ACP నారాయణ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులను స్కూల్, కళాశాలలకు బైక్‌పై విద్యార్థులను రానివ్వొద్దని సూచించారు. ఈ విషయం పై స్కూల్, కళాశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి..వారికి సూచించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ సీఐ వి.వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

News July 27, 2024

నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు

image

జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల విద్యాలయంలో పాముకాటుకు గురైన ఇద్దరు 8వ తరగతి విద్యార్థులు నిజామాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒకరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గణేశ్ (13), హర్షవర్ధన్(14)లతో పాటు గణాదిత్య‌ గురువారం రాత్రి ఒకే గదిలో నేలపై నిద్రపోగా ఈ ముగ్గురిని పాము కాటు వేసినట్లు సమాచారం. ఇందులో గణాదిత్య మృతి చెందిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!