Nizamabad

News April 25, 2024

నామినేషన్ దాఖలు చేసిన సురేశ్ షేట్కార్

image

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేశ్ షేట్కార్ 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకి అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

News April 25, 2024

నామినేషన్ వేసిన NZB కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

image

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వాటర్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఉన్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన భీంగల్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

image

భీంగల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని తుమ్మ సుప్రీక 955, కావ్య 938 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విభాగంలో శ్రీపాద వైష్ణవి 935, సారా మహీన్ 926, జుహానాజ్ 911 మార్కులు సాధించారని చెప్పారు.

News April 25, 2024

కామారెడ్డి:ఈనెల 25 నుంచి మే 8 వరకు ఓటర్ స్లిప్పుల పంపిణీ

image

ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు జిల్లాలోని ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పించాలని కోరారు.

News April 25, 2024

ఇంటర్ సెకండియర్ రిజల్డ్స్..చివరి స్థానంలో కామారెడ్డి

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 59.59 శాతంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా 29వ స్థానంలో నిలిచింది. 13988 మందికి 8335 మంది పాసయ్యారు. 44.29 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 7234 మందికి 3204 మంది పాసయ్యారు.

News April 25, 2024

ఇంటర్ ఫస్టియర్ రిజల్డ్స్..చివరి స్థానంలో కామారెడ్డి

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 49.95 శాతంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో 27వ స్థానంలో నిలిచింది. 8551 మందికి 5200 మంది పాసయ్యారు. 34.81 శాతంతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 7658 మందికి 2666 మంది పాసయ్యారు.

News April 25, 2024

నిజామాబాద్ మహిళ ఖమ్మంలో మృతి

image

నిజామాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన పోచమ్మ ఖమ్మం జిల్లాలో మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైఎస్ఎస్ ఆర్ కాలనీలో పోచమ్మ కుమారుడు నివాసం ఉంటున్నాడు. వారం క్రితం కుమారుడి ఇంటికి వెళ్లిన పోచమ్మ సోమవారం చింతకాని మండలం వందనం గ్రామ సమీపంలోని పొలాల్లో చనిపోయింది. కొద్ది కాలంగా మతిస్థిమితం సక్రమంగా లేదని ఆమె కుమారుడు తెలిపాడు.

News April 25, 2024

నిజామాబాద్: రేపటి నుంచి పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. పరీక్షలు ఏప్రిల్ 25న ప్రారంభమై మే 2 వరకు కొనసాగుతాయన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 న ప్రారంభమై అదే నెల 10 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.

News April 25, 2024

నేడు ఇంటర్ ఫలితాలు.. ఉమ్మడి NZB నుంచి ఎంత మంది అంటే

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 35346 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 19509 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

KMR: నేడు సురేశ్ శెట్కార్ నామినేషన్..!

image

జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ నేడు నామినేషన్ వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారి వల్లూరి క్రాంతికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు ఆయన వివరించారు.