Nizamabad

News April 25, 2024

NZB పార్లమెంట్‌‌లో మంగళవారం 16 నామినేషన్లు దాఖలు

image

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి మంగళవారం 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వివిధ పార్టీల తరఫున అభ్యర్థులు, స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్‌లు వేసినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు 26 మంది అభ్యర్థులు మొత్తం 44 నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వెల్లడించారు.

News April 25, 2024

NZB జిల్లాలో BRSకు షాక్.. BJP లోకి కోటపాటి

image

లోక్ సభ ఎన్నికల వేళ NZB జిల్లాలో BRS పార్టీకి షాక్ తగిలింది. రైతు, గల్ఫ్ సంక్షేమ సంఘం నేత కోటపాటి నరసింహనాయుడు BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరుతున్నట్లు ప్రకటించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కోటపాటి పసుపు బోర్డు కోసం రైతుల పక్షాన పోరాటాలు చేశారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డుపై ప్రకటన చేసినందున బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.

News April 24, 2024

NZB: 1.25 కేజీల గంజాయి లభ్యం.. ముగ్గురి అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. ఆటోనగర్‌లోని షకీలా బీ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా 1.25 కేజీల గంజాయి లభ్యమైనట్లు ఎస్సైజ్ సీఐ దిలీప్ తెలిపారు. షకీలా బీ ఆమె కూతురు నాందేడ్‌లో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ అల్లుడి సహయంతో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు షకీలా బీతో పాటు ఆమె కూతురు అస్మా, అల్లుడు షేక్ వసీంలను అరెస్ట్ చేసినట్లు CI వివరించారు.

News April 24, 2024

సురేశ్‌ షేట్కార్‌ ఆస్తుల వివరాలు

image

జహీరాబాద్ కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షేట్కార్‌ తన కుటుంబ ఆస్తులు రూ.10.77కోట్లగా ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. చరాస్తుల విలువ రూ.3.20 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.7.57 కోట్లు, ప్రైమ్‌ ఫుడ్‌ టెక్‌ ప్రై.లిమిటెడ్‌లో రూ.20 లక్షల విలువైన షేర్లు, ఆయన సతీమణి పేరిట 3.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఖేడ్‌, సంగారెడ్డిలో కలిపి 60.08 ఎకరాల వ్యవసాయ, అర ఎకరా వ్యవసాయేతర భూమి, 2 ఇళ్లు ఉన్నాయి.

News April 24, 2024

కామారెడ్డి: ఓటు వజ్రాయుధం వంటిది: కలెక్టర్

image

ప్రజాస్వామ్యం ప్రతి ఓటు కీలకమని, రాజ్యాంగం తమకు కల్పించిన ఓటుహక్కును ట్రాన్స్ జెండర్లు సంపూర్ణంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ అన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడుతూ.. అపోహలు విడనాడి, ఓటు ప్రాముఖ్యతను తెలుసుకొని ధైర్యంగా ఓటు వేయాలని సూచించారు.

News April 24, 2024

జహీరాబాద్: బీబీపాటిల్ ఆస్తులు ఇవే..!

image

జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీపాటిల్‌ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లుగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధసంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్‌ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులున్నాయి.

News April 24, 2024

కామారెడ్డి : మంటలంటుకుని రైతు మృతి

image

బీర్కూర్ మండల కేంద్రానికి అరిగె చిన్నరాములు(64) అనే వ్యక్తి తన పొలంలోని వరికొయ్యలకు సోమవారం నిప్పుపెట్టాడు. దీంతో భారీగా పొగ అతన్ని తాకడంతో సృహతప్పి పొలంలోనే పడిపోయాడు. మంటలు చెలరేగి అతన్ని చుట్టు ముట్టడంతో చిన్నరాములు సజీవ దహనమయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లిన రాములు ఇంకా రాలేదని అతని కుమారుడు పొలం వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

News April 24, 2024

ఎడపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

ఎడపల్లి సాటాపూర్ గేటు సమీపంలోని ఆడి చెరువులో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. తెల్లటి చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 24, 2024

NZB: పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలో కత్తిపోట్లు

image

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద పోలీస్ ఔట్ పోస్టు సమీపంలో సోమవారం సాయంత్రం కత్తిపోట్లు జరిగాయి. ఈ ఘటనలో అక్రం ఖాన్ అనే యువకుడు ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై కత్తితో దాడికి దిగాడు. దీనితో ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గంజాయి మత్తులో పాత కక్షల కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

News April 24, 2024

NZB: టెట్‌కు తగ్గిన ఆదరణ

image

టెట్‌కు దరఖాస్తులు తగ్గాయి. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అనాసక్తి చూపుతున్నారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో చాలా తక్కువ మంది ఉత్తీర్ణత సాధించడంతో టెట్ అప్లయ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పేపర్-1 4327, పేపర్-2 9045 మంది అప్లయ్ చేసుకున్నారు. కామారెడ్డిలో పేపర్-1కు 3773, పేపర్-2కు 4440 మంది దరఖాస్తు చేసుకున్నారు.