India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి నదిపై రాష్ట్రంలో నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నేటితో 61 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు శంకుస్థాపన చేయగా, 1978లో నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రజలకు తాగు, సాగు నీరు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది.
బడ్జెట్లో రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పాల్గొనగా.. వీరి వెంట జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సైతం పాల్గొని ప్లకార్డు ప్రదర్శించి నిరసన తెలిపారు.
భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి ఆపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి టి.నాగరాణి బుధవారం తీర్పు చెప్పారు. జిల్లాలోని లింగంపేట్ మండలం పోతాయిపల్లికి చెందిన గారబోయిన చిన్న సంగయ్య (43) తన భార్యపై హత్యాయత్నం చేసినట్లు నిరూపణ కావడంతో ఈ తీర్పును వెలువరించారు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య తన సిబ్బందితో బుధవారం దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 1,12,800 నగదు, రెండు కార్లు, 4 బైక్‌లు, 10 మొబైల్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దేవుని పల్లి పోలీసులకు అప్పగించారు.
కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలంలో మంగళవారం జరిగింది. SI మోహన్ రెడ్డి వివరాలిలా.. మండలంలోని రాజాపూర్ వాసి కొత్త రాములు అతని పొలంలో నాటు వేస్తుండగా.. పొలం మధ్యలో పడి ఉన్న కరెంట్ వైరును గమనించాడు. దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.
TU పరిధిలోని డిగ్రీ (CBCS) రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) ఒకటవ మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం. అరుణ బుధవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రివల్యూషన్ ఫీజు ఒక్కొక పేపర్ కు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు.
బోడ కాకరకాయలకు మార్కెట్లో భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తీంటారు. దీంతో బోడ కాకరకాయలకు మార్కెట్లో రేటు విపరీతంగా పెరిగిపోయింది. కేజీ రూ.280 మార్కెట్లో అమ్ముతున్నారు. అయినప్పటికీ వాటిని పలువురు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి. మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నారు.
సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామశివారులో 44 నంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి కుంగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం హైవే అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి రోడ్డును పరిశీలించారు. రోడ్డు కుంగలేదని, ఒక ఇనుప పట్టి విరిగిందని, దాని పక్కన ఉన్న డాంబర్ వర్షపు తాకిడికి లేచిందని అధికారులు తెలిపారు.
భూ సంస్కరణల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(భూఆధార్)ను కేటాయించాలని, పట్టణ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో భూసంబంధిత సమస్యలకు పరిష్కారం లభించనుంది. కామారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3,12,987, పట్టణాల్లో 1,02,456 ఎకరాల భూమి ఉంది. నిజామాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4,03,312 పట్టణ ప్రాంతాల్లో 2,08,800 ఎకరాల భూమి ఉంది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై NZB మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ స్పందించారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. TG ప్రజలకు BJP ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ‘గుండు సున్నానా ‘ అని ప్రశ్నించారు. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ TGకు బడ్జెట్లో అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు.
Sorry, no posts matched your criteria.