Nizamabad

News May 24, 2024

నిజామాబాద్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. 28,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు

News May 24, 2024

NZB: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

image

పాలిసెట్- 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. 16 పరీక్ష కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉ. 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని విద్యార్థులు 10 గంటలలోపు చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని తెలిపారు.

News May 23, 2024

BSWD: మహిళ మృతదేహం వివరాలను గుర్తించిన పోలీసులు

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని మహిళ (35) వివరాలను పోలీసులు గుర్తించారు. మృతురాలిని గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన వారాంతపు సంతలో కూరగాయలు అమ్మే లక్ష్మీగా గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వెళ్లి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సింధూ శర్మ పరిశీలించారు.

News May 23, 2024

BSWD: అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

image

బాన్సువాడ మండలంలోని కృష్ణా నగర్ తండా అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (35) మృతదేహం లభ్యమైనట్లు బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతురాలు ఒంటిపై గులాబీ రంగు చీర, బంగారు రంగు జాకెట్ ధరించి ఉందని, నలుపు రంగు స్కార్ఫ్ కూడా ఉన్నట్లు సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా మృతురాలి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

News May 23, 2024

నవీపేట్ మండలంలో పేలిన సెల్ ఫోన్

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని ఫకీరాబాద్ గ్రామంలో సెల్ ఫోన్ పేలింది. కొమ్మొల్ల యోగేష్ కు చెందిన మెుబైల్ సెల్‌ఫోన్ పేలడంతో భయభ్రాంతులకు లోనయ్యారు. మంటలు రావటంతో అతని కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలను ఆర్పివేశారు. ఎవరికి ఎలాంటి హని జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 23, 2024

ఎడపల్లి: యువతిపై ఆగంతకుల దాడి..!

image

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో దారుణం జరిగింది. జాన్కంపేట శివారులోని కెనాల్ వద్ద ఇవాళ ఉదయం ఓ యువతి తీవ్రగాయాలతో అపస్మారక స్థతిలో పడి ఉంది. ఇది గమనించిన వాకర్స్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని తీవ్రగాయలతో ఉన్న యువతిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.

News May 23, 2024

NZB: నిఖత్ జరీన్‌కు సన్మానం

image

ఇటీవల కజకిస్థాన్‌లో జరిగిన ఎలోర్డా పోటీల్లో 52 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతగా నిలిచి బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కమిషనర్ శాలువాతో సత్కరించారు. దేశ గౌరవం విశ్వ వ్యాప్తం చేసేలా మున్ముందు మరింత రాణించాలని కమిషనర్ కోరారు.

News May 23, 2024

NZB: గంజాయి కేసులో 9 మంది అరెస్ట్

image

గంజాయి కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఏర్గట్ల SI మచ్చేందర్ రెడ్డి తెలిపారు. కమ్మర్‌పల్లికి చెందిన ఆరీఫ్ ఇంట్లో ఫంక్షన్‌కి HYDకి చెందిన అబ్దుల్ రెహమాన్, అజర్, శంషద్, సమీర్, వంశీవర్ధన్, సలీం పాషా హాజరయ్యారు. నిర్మల్‌కి చెందిన షాదుల్లా, అజారుద్దీన్ వద్ద గంజాయి కొని తాళ్లరాంపూర్ ఈతవనంలో గంజాయి తాగుతూ హంగామా చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేసి 268 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు.

News May 23, 2024

NZB: ఫలితాలకు ఇంకా 13 రోజులే

image

ఈ నెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆభ్యర్థులుగా పోటీ చేసిన వారే కాకుండా పార్టీల గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు సైతం ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా 13రోజులే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మెదలైంది.

News May 23, 2024

తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయపరిధిలో స్కిల్ కోర్స్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం తెలంగాణ యూనివర్సిటీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం ఉందని వివరించారు.