India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 22 వేల ఇన్‌ఫ్లో క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1069 అడుగల నీటిమట్టం ఉంది.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రికార్డుస్థాయిలో ఓపీ నమోదువుతోంది. వారంరోజుల్లో 14,576 OP నమోదైంది. IP కింద 846 మంది చేరారు. వీరిలో జ్వరం, వాంతులు, విరేచనాలతో 3,093 మంది బాధితులు వైద్యం తీసుకున్నారు. కేవలం జ్వరంతోనే 138 మంది ఆసుపత్రిలో చేరారు. ఇప్పటివరకు 5009 మంది రోగుల నుంచి రక్తనమునాలు సేకరించారు. నిత్యం 700 నుంచి 800 మంది రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని సిర్పూర్‌కు చెందిన ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. రోజులాగానే అభి సోమవారం గ్రామశివారులోని గోదావరిలోకి చేపల వేటకు వెళ్లారు. ఆ సమయంలో అతని వలలో 30 కిలోల చేప చిక్కింది. దీనిని వ్యాపారికి విక్రయించారు. తనకు ఇంత భారీ చేప దొరకడం ఇదే మొదటిసారి అన్నారు.
నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులైన న్యాయవాది వెంకటరమణ గౌడ్, నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా నియమితులైన పి. రాజులు సోమవారం జిల్లా కోర్టులోని తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. వారికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అభినందించారు.
ముప్కాల్ ఇందిరమ్మ కాలనీలో సోమవారం భారీ చోరీ జరిగింది. లింబాద్రి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 30 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న ముప్కాల్ ఎస్సై భాస్కర చారి సంఘటన స్థలానికి చేరుకొని ఆర్మూర్ సీఐకు సమాచారం అందించారు. ఆర్మూర్ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా 20,023 క్యూసెక్కుల నీరు రాగా రాత్రి 9 గంటలకు 21,500 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఔట్ ఫ్లోగా 518 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా ప్రస్తుతం 1068.90 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
పసుపులోడుతో పాటు లారీని దొంగిలించిన కేసులో నిందితుడైన నవీపేట్‌కు చెందిన షేక్ తోఫిక్ అలీ అలియాస్ షరీఫ్ (37) ను సోమవారం అరెస్టు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO డి.విజయ్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి రూ. 30 లక్షలపసుపును, రూ.40 లక్షల లారీని స్వాధీన పరుచుకుని మిగతా నేరస్థుల కోసం గాలిస్తున్నామని విజయ్ బాబు చెప్పారు.
కామారెడ్డి జిల్లాలో ఉన్న బ్యాంకు లీకేజీ టార్గెట్‌ను త్వరితగతిన నెలల వారీగా అన్ని మండలాల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశించారు. సోమవారం ఆయన DRDA సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. మహిళా శక్తిలో భాగంగా గుర్తించిన అన్ని రకాల యాక్టివిటీలు, గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి చందర్, డిపిఎం రమేష్ , రవీందర్, సుధాకర్, వకుళ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ విశ్వ విద్యాలయ పరిధిలో బీ.ఎడ్. నాల్గవ సెమిస్టరు, రెగ్యులర్ 1వ, 2వ, 3వ, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు ఆగస్టు 1వ తేదీ లోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య.ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే రూ.100 అపరాధ రుసుముతో 02-8-2024 వరకు చెల్లించవచ్చన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు వివరించారు.
నిజామాబాద్ నగరంలోని పెద్దబజారు యూనియన్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడైన మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మేనేజర్ అజయ్ ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. కేసు విచారిస్తున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని నిజామాబాదు తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.